టీమిండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌కు ఈ వెస్టిండీస్ సిరీస్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఈ సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లు కూడా గిల్‌ను మూడు విధాలుగా సర్ప్రైజ్ చేశాయి. తొలి రెండు మ్యాచ్‌ల్లో చేసిన తప్పులను మూడో మ్యాచ్‌లో సరిచేసుకున్న గిల్‌కు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. దీంతో గిల్‌పై సోషల్ మీడియాలో జాలి జల్లు కురుస్తోంది. అసలు గిల్ విషయంలో ఏం జరిగిందో తెలుసుకుందాం.. వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేసింది. ఈ సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌ల్లోనూ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ రాణించాడు. మూడు మ్యాచ్‌ల్లో రెండు హాఫ్‌సెంచరీలు ఉన్నాయి. తొలి మ్యాచ్‌లో 64 పరుగులు చేసిన గిల్ రెండో వన్డేలో 43 పరుగులు చేశాడు. ఇక బుధవారం జరిగిన చివరి వన్డేలో 98 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. గత రెండు మ్యాచ్‌ల్లో బాగా ఆడుతూనే.. చేజేతులా వికెట్ సమర్పించుకున్నాడు. తొలి మ్యాచ్‌లో సింగిల్ కోసం బద్దకంగా పరిగెత్తి.. పూరన్ సూపర్ త్రోకు రనౌట్ అయ్యాడు. అలాగే రెండో వన్డేల్లో హాఫ్ సెంచరీకి చేరువైన దశలో అనవసరపు స్కూప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించి బౌలర్‌కు ఈజీ క్యాచ్ ఇచ్చి వికెట్ పారేసుకున్నాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లో గిల్ అవుట్ అయిన తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. దీనిపై గిల్ కూడా స్పందించాడు. ‘నాకు మంచి స్టార్ లభిస్తున్నా.. పెద్ద ఇన్నింగ్స్ ఆడి సెంచరీ చేయలేకపోతున్నాను. ఈ విషయంలో నాపై నాకే కోపంగా ఉంది’ అని తన ఆవేదనను వెల్లగక్కాడు. రెండు వన్డేల్లో తాను చేసిన తప్పులను గుర్తించి.. మూడో వన్డేలో రిపీట్ చేయకూడదని బలంగా నిర్ణయించుకుని బరిలోకి దిగిన గిల్.. ఆచితూచి ఆడాడు. మరో తప్పు చేయకుండా వన్డేల్లో తన తొలి సెంచరీ వైపు అడుగులేశాడు. కానీ.. ప్రకృతి పగబట్టినట్లు గిల్ 98 పరుగుల వద్ద ఉన్నప్పుడే కుండపోత వర్షం వచ్చింది. దీంతో అంపైర్లు ఆటను నిలిపివేశాడు. తొలి సెంచరీ సాధించి.. బ్యాట్‌ను గాల్లోకి లేపాలని భావించిన గిల్ ఆశలపై ప్రకృతి నీళ్లు చల్లింది. చేసేదేం లేక గిల్ ఎంతో నిరాశగా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాడు. వెంటనే వర్షం ఆగితే మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీ పూర్తి చేసే అవకాశం ఉండేది. కానీ.. చాలా సేపటి తర్వాత వర్షం ఆగడంతో అంపైర్లు మ్యాచ్‌ను డక్‌వర్త్ లూయీస్ పద్ధతిలో మ్యాచ్‌ను 35 ఓవర్లలకు కుదించి.. వెస్టిండీస్‌ను బ్యాటింగ్‌కు పిలిచారు. దీంతో గిల్ 98 పరుగుల వద్ద నాటౌట్‌గా మిగిలాడు. దీంతో గిల్‌కు ఎదురైన పరిస్థితిపై సోషల్ మీడియాలో ‘నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గిల్’ అంటూ నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. Every cricket fans can feel this Just 2 runs... Rain stopped play@ShubmanGill #Cricket #CricketLive #IndvsWI #ShubhmanGill pic.twitter.com/RNONGLIbb1 — Shahid Jamal Fatmi (@_shahidfatmi) July 27, 2022 Shubman Gill on 98* By Just 2 runs, He missed to become Youngest Indian Opener to Score Overseas ODI Century Previous: Sachin (23yr 291d)#IndvsWI #Shubmangill #ShubhmanGill pic.twitter.com/X9qRkTM38x — Vishwajeet Jaykar (@Vishwajaykar) July 27, 2022 @ShubmanGill 98(98)* Missed his madien ODI 100 due to rain Unlucky Gill#WIvsIND #ShubhmanGill pic.twitter.com/W1JDxGmI8j — Abhi (@imRo45_A) July 27, 2022 Dil se bura lagta hai bhai!#IndvsWI #IndvsWI #ShubhmanGill #rain #gill pic.twitter.com/RbmLL4zo1k — Yogen (45) (@frontFootPuller) July 27, 2022