క్రికెట్లో ఒక్కో ఆటగాడికి ఒక్కోలా.. యూనిక్ సెలబ్రేషన్స్ ఉండడం సహజం. బ్యాటర్లకు హాఫ్ సెంచరీ చేసినప్పుడో లేదా సెంచరీ చేసినప్పుడో మాత్రమే ఈ అవకాశం దక్కుతుంది. కానీ బౌలర్లకు అలా కాదు. వికెట్ తీసిన ప్రతీసారి పండుగే. అందులోనూ.. ఒక్కొక్కరిది ఒక్కోశైలి. ఔటై వెళ్తున్న బ్యాటర్ల మీద అరవడం, వారి ముందు నుంచి వెళ్తూ డాన్సులేయడం.. అవీ కాదంటే.. అప్పటికే ట్రెండింగ్ లో ఉన్న సాంగ్స్ కు కాలు కదపడం లాంటివి బోలెడు చేస్తారు. కానీ, మనం చెప్పబోయే బౌలర్ వీటన్నింటికీ భిన్నంగా.. 'ఇదేందిరా అయ్యా' అనిపించే విధంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. విషయంలోకి వెళితే.. ఐసీసీ మెన్స్ టి20 వరల్డ్కప్ సబ్ రీజియన్ క్వాలిఫయర్స్ గ్రూఫ్-ఏలో సెర్బియా, ఐల్ ఆఫ్ మ్యాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో సెర్బియా బౌలర్.. 'అయో మేనే-ఎజెగి' నాలుగు వికెట్లతో మెరిశాడు. అందులోనూ.. ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీశాడు. ఈ క్రమంలో.. వికెట్ తీయగానే పచ్చిక మీదకు వెళ్లి రెండు సార్లు గెంతులు వేసి తర్వాత నేలపై రెండు చేతులను బార్లా చాచి పడుకున్నాడు. వికెట్ తీసిన ప్రతీసారి ఎజెగి.. ఇదే సెలబ్రేషన్స్ తో అక్కడున్న వారిలో నవ్వులు పూయించాడు. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఐసీసీ.. ''వందో వికెట్ సాధించిన ఆనందంతో సెలబ్రేషన్ చేసుకున్న సెర్బియా క్రికెటర్ అయో మేనే-ఎగిజి'' అని క్యాప్షన్ జత చేసింది. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచులో ఐల్ ఆఫ్ మ్యాన్ 68 పరుగుల తేడాతో సెర్బియాపై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐల్ ఆఫ్ మ్యాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేయగా.. సెర్బియా ఏడు వికెట్ల నష్టానికి 97 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక ఈ ఏడాది అక్టోబర్-నవంబర్లో జరగనున్న టి20 ప్రపంచకప్ 2022కు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సెలబ్రేషన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. View this post on Instagram A post shared by ICC (@icc) ఇది కూడా చదవండి: వీడియో: ప్యాడ్లు మరిచి బ్యాటింగ్ కు వచ్చిన బ్యాటర్.. గల్లీ క్రికెట్ ను తలపించిన లైవ్ మ్యాచ్! ఇది కూడా చదవండి: MS Dhoni: క్లాసిక్ కార్లలో చక్కర్లు కొడుతున్న మహేంద్ర సింగ్ ధోని.. వైరలవుతున్న వీడియోలు!