మైదానంలో జోరుగా సాగే క్రికెట్ ఆట గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రసవత్తర మ్యాచులు జరగడంతో పాటుగా ఫన్నీ సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇప్పటివరకు క్రికెట్ లో బాగా నవ్వించిన సందర్భాలంటే.. ఆటగాళ్లు క్యాచ్ పొట్టబోయి ప్యాంటు జారిపోవడం, ఒకరని ఒకరు ఢీకొట్టడం, పరుగెడుతూ దొర్లడం.. లాంటి ఘటనలు చూశాం. అయితే.. వీటన్నిటికీ భిన్నంగా మరొక ఘటన చోటుచేసుకుంది. బ్యాటింగ్ కు చేయడానికి క్రీజులోకి వచ్చిన బ్యాటర్.. ప్యాడ్లను కట్టుకోవడం మర్చిపోయాడు. ప్రత్యర్థి ప్లేయర్స్ చెప్పేవరకు అతడికి సోయే లేదు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. సాధారణంగా మ్యాచ్ ఎవరితోనైనా సరే.. ఒక బ్యాటర్ ఔటైతే తర్వాత వచ్చే ఆటగాడు సిద్ధంగా ఉంటాడు. వెంటనే క్రీజ్‌లోకి వచ్చేస్తాడు. కానీ, ఇక్కడ మాత్రం కొత్తగా వచ్చిన బ్యాటర్ చేసిన పని నవ్వులు పూయించింది. హెల్మెట్ పెట్టుకొని బ్యాట్ తో మైదానంలోకి దిగిన సదరు బ్యాటర్ ఫ్యాన్లను ధరించకుండా వచ్చాడు. వికెట్ల వద్దకు వెళ్లి 'గార్డ్' తీసుకుంటూ ఉంటాడు. ఈ సంఘటనను అంపైర్ కూడా గమనించకపోవడం గమనార్హం. అయితే, ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు గుర్తించి సదరు బ్యాటర్ కు చెప్పడంతో.. సారీ చెప్పి.. షట్ అనుకుంటూ డగౌట్‌కు పరిగెత్తాడు. దీనికి సంబంధించిన వీడియో పన్నీగా ఉండటంతో తెగ వైరలవుతోంది. ఇంతకీ ఈ మ్యాచ్ ఎక్కడ జరిగిందో తెలుసా.. క్రికెట్ పుట్టినిళ్లు ఇంగ్లాండ్ లో. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేసి.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. pic.twitter.com/JEYho6zRaG — That’s so Village (@ThatsSoVillage) July 20, 2022 not his fault.. 2 wickets in 3 deliveries. No one can be prepared for this!! — Fakhar Ul Islam (@Fakhar_Ul_Islam) July 20, 2022 ఇదీ చదవండి: Hemang Badani: ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన గంగూలీ ఈ ఆటగాడిని తొక్కేశాడా? ఇదీ చదవండి: MS Dhoni: క్లాసిక్ కార్లలో చక్కర్లు కొడుతున్న మహేంద్ర సింగ్ ధోని.. వైరలవుతున్న వీడియోలు!