టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సరదాగా స్కేటింగ్ స్కూటర్‌పై చక్కర్లు కొట్టాడు. ఆసియా కప్ కోసం యూఏఈలో ల్యాండ్ అయిన రోహిత్ అండ్ కో.. ప్రాక్టీస్‌లో లీనమైపోయింది. ఆదివారం పాకిస్థాన్‌తో మ్యాచ్ నేపథ్యంలో ఆటగాళ్లందరూ నెట్స్‌లో కఠోరంగా శ్రమిస్తున్నారు. లాంగ్ రెస్ట్ తర్వాత జట్టులోకి వచ్చిన విరాట్ కోహ్లీతో కలిసి కెప్టెన్ రోహిత్ శర్మ గురువారం నెట్స్‌లో చాలా సేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. నెట్ సెషన్స్ ముగిసిన తర్వాత రోహిత్ సరదాగా గ్రౌండ్లో స్కేటింగ్ స్కూటర్‌పై చక్కర్లు కొట్టాడు. ఈ వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. ఎంతో బ్యాలెన్స్‌గా రోహిత్ ఆ స్కేటింగ్ సైకిల్‌ను డ్రైవ్ చేస్తున్నాడంటూ క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్‌లో పేర్కొంటున్నారు. ప్రస్తుతం రోహిత్ శర్మ స్కేటింగ్ సైకిల్ నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇకపోతే రేపటి(శనివారం ఆగస్ట్ 27) నుంచి ఆసియా కప్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఆదివారం(ఆగస్ట్ 28) పాకిస్థాన్‌తో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌ను ఎలాగైన గెలిచి గతేడాది టీ20 వరల్డ్ కప్‌లో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవాలని భారత ఆటగాళ్లు బలంగా ఫిక్స్ అయి ఉన్నారు. మరో వైపు పాకిస్థాన్ కూడా టీ20 వరల్డ్ కప్‌లో కనబర్చిన ప్రదర్శనను పునారవృతం చేయాలని భావిస్తుంది. ఐసీసీ మెగా ఈవెంట్స్‌లో పాకిస్థాన్‌పై భారత్‌దే పైచేయి అయినప్పటికీ.. గతేడాది జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో లీగ్ దశలోనే భారత్ ఇంటిదారి పట్టేందుకు పాక్‌పై ఓటమే ప్రధాన కారణంగా నిలిచింది. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇద్దరూ గత కొంత కాలం సరైన ప్రదర్శన కనబర్చలేదు. స్థాయికి తగ్గ భారీ స్కోర్ చేసి చాలా రోజులవుతుంది. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మకమైన ఆసియా కప్ తొలి మ్యాచ్‌లోనే అది కూడా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారీ స్కోర్ బాది ఫామ్‌లోకి రావాలని తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అలాగే ఇప్పటికే అత్యధిక ఏడు సార్లు భారత్ ఆసియా కప్ గెలిచింది. మరోసారి ఆసియా కప్ గెలిచి ఆ సంఖ్యను మరింత మెరుగుపర్చాలని కూడా కెప్టెన్ రోహిత్ శర్మ దృఢ సంకల్పంతో ఉన్నాడు. ఆసియా కప్‌లో విజేతగా నిలిస్తే.. ఆ వెంటనే జరిగే టీ20 వరల్డ్ కప్‌లో కూడా ఆత్మవిశ్వాసంతో ఆడొచ్చని రోహిత్ భావిస్తున్నాడు. మరి ఆసియా కప్‌లో రోహిత్ సేన విజయావకాశాలు, స్కేటింగ్ స్కూటర్‌పై రోహిత్ చక్కర్లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: బ్రేకప్ చేప్పేసుకున్న శుభ్ మన్ గిల్-సారా టెండూల్కర్! నాకు భవిష్యత్తే ముఖ్యమన్న గిల్ Vroooming into the end of practice session - Captain @ImRo45 style #TeamIndia | #AsiaCup2022 | #AsiaCup pic.twitter.com/OqF9eksgCP — BCCI (@BCCI) August 25, 2022