ఆసియా కప్ 2022.. ఇప్పటి వరకు టీమిండియా ఎంతో గొప్ప ప్రదర్శనతో దూసుకుపోతోంది. ఇప్పటికే గ్రూప్ ఏ నుంచి సూపర్ 4కు దూసుకెళ్లిన మొదటి జట్టుగా నిలిచింది. తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. ఆ తర్వాత రెండో మ్యాచ్ లో హాంకాంగ్‌పై 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమిండియా అద్భుతంగా రాణిస్తోంది. ఇంకేముంది ఆసియా కప్ కూడా మనదే అనుకునే తరుణంలో టీమిండియాకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆసియా కప్ నుంచి రవీంద్ర జడేజా దూరం అయ్యాడు. అవును.. ఆసియా కప్ నుంచి రవీంద్ర జడేజా దూరమయ్యాడు. గాయం కారణంగా ఇంక మ్యాచ్‌లో పాల్గొనలేడని వైద్యులు నిర్ధారించారు. కుడికాలి మోకాలికి అయిన గాయం కారణంగా రవీంద్ర జడేజా తదుపరి మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం బీసీసీఐ మెడికల్ టీమ్ అబ్సర్వేషన్లో రవీంద్ర జడేజాకు వైద్యం అందిస్తున్నారు. ఈ వార్త విన్న టీమిండియా ఫ్యాన్స్ షాక్‌లో ఉన్నారు. ఎందుకంటే మొదటి రెండు మ్యాచుల్లో రవీంద్ర జడేజా అద్భుతంగా రాణించాడు. Axar Patel replaces injured Ravindra Jadeja in Asia Cup squad: BCCI pic.twitter.com/t7NH4Vn0D7 — ANI (@ANI) September 2, 2022 పాకిస్తాన్‌పై విజయంలో రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. హాంకాంగ్‌పై బ్యాటింగ్‌కు అవకాశం రాకపోయినా.. బౌలింగ్, ఫీల్డింగ్‌లో అద్భుతంగా రాణించాడు. ఇప్పుడు రవీంద్ర జడేజా స్థానంలో జట్టులోకి మరో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ రానున్నాడు. స్టాండ్‌బై లిస్ట్‌లో ఉన్న అక్షర్ పటేల్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు సీనియర్ టీమ్ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. త్వరలోనే దుబాయ్‌లో ఉన్న జట్టులో అక్షర్ పటేల్ చేరబోతున్నట్లు ప్రకటించారు. జడేజా గాయపడినట్లు- అక్షర్ పటేల్ అతని స్థానంలో రానున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జే షా వెల్లడించారు. జట్టుకు జడేజా దూరం కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. NEWS - Axar Patel replaces injured Ravindra Jadeja in Asia Cup squad. More details here - https://t.co/NvcBjeXOv4 #AsiaCup2022 — BCCI (@BCCI) September 2, 2022 ఇదీ చదవండి: నో బాల్ వేయడం ఒక క్రైమ్! మ్యాచ్ ఓడిపోయాక షకీబ్ సంచలన కామెంట్స్! ఇదీ చదవండి: దొరికిన కొంతటైమ్లో కోహ్లీ బ్యాటింగ్ చూద్దామని కూర్చున్నా: అఫ్రిదీ