చాహార్‌ ఓవర్‌యాక్షన్‌.. దారుణంగా ట్రోల్‌ చేస్తున్న నెటిజన్లు

ఐపీఎల్‌ 2021 రెండో దశలో భాగంగా నిన్న రాత్రి ముంబై ఇండియన్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగుళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా ఈ మ్యాచ్‌లో తెలుగు తేజం ఆర్సీబీ ఆటగాడు కేఎస్‌ భరత్‌ తనకొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించాడు. అందులో భాగంగానే రెండు భారీ సిక్స్‌లు కొట్టాడు. ఓపెనర్‌ పడిక్కల్‌ వికెట్‌ కోల్పోయిన ఒత్తిడిలో ఉన్న జట్టుకు తన హిట్టింగ్‌తో మంచి జోష్‌ ఇచ్చాడు. ఈ విషయాన్ని కోహ్లీ కూడా ప్రత్యేకంగా ప్రస్తావించాడు. కొత్త కుర్రాడు మంచి షాట్లు కొట్టాడు అని అందరూ అభినందిస్తూ సంతోషపడితే. రాహుల్‌ చాహార్‌ మాత్రం కొంచెం అతి చేసినట్లు కనిపించాడని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Rahul Chahar rude behaving after taken a Wicket on RCB - Suman TVదీనికి కారణం రాహుల్‌ చాహార్‌ బౌలింగ్‌లో భరత్‌ వరుసగా రెండు సిక్స్‌ర్లు బాదడమే. బ్యాట్స్‌మెన్‌ అన్నాక పరుగులు చేయడం కామన్‌. భరత్‌ లాంటి కొత్త ఆటగాడు వచ్చిన చాన్స్‌ను ఉపయోగించుకునేందుకు బౌలర్‌ ఎవరన్నది కూడా చూడకుండా పరుగులు చేసేందుకు తెగిస్తారు. అలానే భరత్‌ చాహార్‌ బౌలింగ్‌లో కొంచెం దూకుడుగా ఆడి రెండు భారీ సిక్స్‌లు కొట్టాడు. అనంతరం అతని బౌలింగ్‌లోనే అవుట్‌ అయ్యాడు. దీంతో చాహార్‌ భరత్‌కేసి కోపంగా చూస్తూ అరిచాడు. కొత్త కుర్రడిపై ఎందుకంత కోపం అంటూ నెటిజన్లు చాహార్‌ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వికెట్‌ తీసుకుంటే ఆనందపడాలి గాని కొత్త ఆటగాళ్లపై ఇలా కోపం ప్రదర్శించడం తప్పు అంటూ చాహార్‌ను మద్దలిస్తున్నారు. ఇక కొంతమంది అయితే చాహార్‌ రియాక‌్షన్‌ వీడియోను దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. కుక్క మొరిగినట్లు సౌండ్‌పెట్టి ట్రోల్‌ చేస్తూ ఆడేసుకుంటున్నారు.