పంజాబ్‌ వర్సెస్‌ రాజస్థాన్‌.. గెలిచే జట్టు ఇదే..!

IPL Match 32 Match PBKS vs RR Analasys - Suman TV

ఈ ఏడాది ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ రెండు జట్లు కూడా తమ తమ ప్రదర్శనతో నిరాశ పరిచాయి. ఈ రెండో దశలో తమ మొదటి మ్యాచ్‌ను ఈ రోజు ఆడబోతున్నాయి. పాయింట్స్‌ టేబుల్‌లో రాజస్థాన్‌ 6, పంజాబ్‌ 7వ స్థానంలో ఉన్నాయి. కాగా ఈ మ్యాచ్‌ ఇరుజట్లుకు కీలకంగా మారింది. ప్లేఆఫ్‌ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలిచితీరాలి. ముఖాముఖి పోటీలో ఆర్‌ఆర్‌ ముందంజలో ఉంది. కాగా రాజస్థాన్‌ రాయల్స్‌లో సంజూ సామసన్‌, మిల్లర్‌, తెవాటియా ప్రధాన బలంగా ఉన్నారు. అటు పంజాబ్‌ విషయానికి వస్తే కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌, క్రిస్‌ గేల్‌, షమి ప్రధాన బలంగా ఉన్నాయి. రాజస్థాన్‌ జట్టులో జోఫ్రా ఆర్చర్‌, బట్లర్‌ లేని కారణంగా ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరీ ఏ జట్టు గెలుస్తుందో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.