న్యూజిలాండ్-ఐర్లాండ్ మధ్య బుధవారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఒక సంచలనం నమోదైంది. కివీస్ యువ ఆటగాడు, ఐర్లాండ్‌తో జరిగిన తొలి వన్డే చివరి ఓవర్లో 24 పరుగులు చేసి న్యూజిలాండ్‌ను గెలిపించిన మైఖేల్ బ్రేస్‌వెల్ ఈ మ్యాచ్‌లో ఏకంగా హ్యాట్రిక్ సాధించాడు. ఇన్నింగ్స్ 14వ వేసిన బ్రేస్‌వెల్ తొలి బంతికి ఫోర్, రెండు బంతికి సింగిల్ ఇచ్చి.. తర్వాతి మూడు బంతుల్లో మూడు వికెట్లు పడగొట్టి హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఈ మూడు వికెట్లతో ఐర్లాండ్ ఇన్సింగ్స్ ముగిసిపోవడంతో.. బ్రేస్‌వెల్ కేవలం ఐదు బంతులు మాత్రమే వేసి మూడు వికెట్లు తీసుకుని కొత్త రికార్డు సృష్టించాడు. కేవలం రెండో టీ20 మ్యాచ్ ఆడుతున్న బ్రేస్‌వెల్ ఆల్‌రౌండర్‌గా జట్టులోకి వచ్చాడు. ఐర్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 82 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్సులతో 127 పరుగులు చేయడమే కాకుండా.. చివరి ఓవర్లో విజయానికి అవసరమైన 24 పరుగులు చేసి మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. తాజాగా రెండో టీ20లో అనూహ్యాంగా హ్యాట్రిక్ సాధించాడు. కాగా వన్డే క్రికెట్లో న్యూజిలాండ్ తరఫున హ్యాట్రిక్ సాధించిన మూడో ప్లేయర్‌గా బ్రేస్‌వెల్ నిలిచాడు. అతని కంటే ముందు 2009 జాకబ్ ఓరమ్, 2010లో టీమ్ సౌథీ ఈ ఘనత సాధించారు. 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు న్యూజిలాండ్ తరపున బ్రేస్‌వెల్ వన్డేల్లో హ్యాట్రిక్ సాధించాడు. లెఫ్ట్‌హ్యాండ్ బ్యాటింగ్ చేసే బ్రేస్‌వెల్, రైట్ ఆర్మ్ ఆఫ్‌బ్రేక్ బౌలింగ్ చేస్తాడు. ఈ ఏడాది మార్చి 29 నెథర్ల్యాండ్స్తో జరిగిన మ్యాచ్‌తో బ్రేస్‌వెల్ వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. ప్రస్తుతం ఐర్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌తోనే టీ20 క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన బ్రేస్‌వెల్ రెండో మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించి సంచలనంగా మారాడు. మరి బ్రేస్‌వెల్ హ్యాట్రిక్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. Michael Bracewell can't Do anything Wrong Hat-trick in his First Over of T20 Internationals is just amazing and Unbelievable pic.twitter.com/nIPmvgCmjM — ⚡ (@Visharad_KW22) July 20, 2022