మన పొరుగు దేశం నేపాల్ తమ జాతీయ క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్‌గా టీమిండియా మాజీ క్రికెటర్‌ను నియమించింది. భారత మాజీ ఆల్‌రౌండర్ మనోజ్ ప్రభాకర్‌ను నేపాల్ క్రికెట్ టీమ్ హెడ్‌కోచ్‌గా నియమిస్తూ.. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ నేపాల్ సోమవారం ప్రకటించింది. ప్రభాకర్ 1984లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టుతో టీమిండియా తరపున అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. అదే ఏడాది శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌తో వన్డేలోకి ఎంట్రీ ఇచ్చాడు. తన కెరీర్లో మొత్తం 39 టెస్టులు ఆడిన ప్రభాకర్ 96 వికెట్లు పడగొట్టడంతో పాటు 1600 పరుగులు కూడా చేశాడు. అలాగే 130 వన్డేల్లో 157 వికెట్లు, 1858 పరుగులు చేశాడు. ఇతనికి టెస్టుల్లో ఒక సెంచరీ, వన్డేల్లో రెండు సెంచరీలు ఉన్నాయి. ప్రభాకర్ రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ వంటి రంజీ జట్లకు గతంలో కోచ్‌గా పనిచేశాడు. అదే విధంగా టీ20 ప్రపంచకప్-2016 సమయంలో ఆఫ్ఘనిస్థాన్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా కూడా బాధ్యతలు నిర్వహించాడు. మరి నేపాల్ క్రికెట్ బోర్డు తమ జట్టు హెడ్ కోచ్‌గా మనోజ్ప్రభాకర్ను నియమించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. Former Indian star all rounder and Ranji trophy winning coach, Mr. Manoj Prabhakar from India has been appointed as the Head Coach of Nepal National Cricket Team. Mr. Prabhakar has played 39 Test matches and 130 One Day Internationals for India. As a Coach, he has experience + pic.twitter.com/VMf60RlJNb — CAN (@CricketNep) August 8, 2022 ఇది కూడా చదవండి: Asia Cup 2022: ఆసియా కప్ టీమ్‌లో ఆ ప్లేయర్ అవసరమా? లాబీయింగ్ జరిగిందా?