ప్రతిష్టాత్మకమైన ఆసియా కప్ కోసం సెలెక్టర్లు సోమవారం భారత జట్టును ప్రకటించారు. ఈ నెల 27 నుంచి ఆసియా కప్ యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది. టీమిండియా తమ తొలి మ్యాచ్ 28న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌తో పాటు ఎనిమిదో సారి ఆసియా కప్‌ను సాధించేందుకు బీసీసీఐ ఒక పటిష్టమైన జట్టును ఎంపిక చేస్తుందని అంతా భావించారు. కానీ.. సోమవారం ప్రకటించిన జట్టులో అనేక లోపాలు ఉన్నాయంటూ క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా ఆవేశ్‌ఖాన్‌ను జట్టులోకి తీసుకోవడంపై మండిపడుతున్నారు. సెలెక్టర్లు కేవలం బ్యాటింగ్‌పైనే మాత్రమే దృష్టిపెట్టారని.. బౌలింగ్ విభాగాన్ని అసలు ఏ మాత్రం పట్టించుకోలేదంటూ మండిపడుతున్నారు. ఇప్పటికే టీమిండియా ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, యువ సంచలనం హర్షల్ పటేల్ గాయాల కారణంగా ఆసియా కప్‌కు దూరమయ్యారు. వారు లేకపోవడంతో జట్టు బౌలింగ్ విభాగం బలహీనంగా మారింది. దీంతో మరో సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీనైనా జట్టులోకి తీసుకుని ఉంటే కొంత బెటర్‌గా ఉండేంది. కానీ.. అలా కూడా చేయలేదు. కొంతలో కొంత మేలైన సిరాజ్‌ను సైతం సెలెక్టర్లు పట్టించుకోకుండా ఆవేశ్‌ఖాన్‌ను జట్టులోకి తీసుకున్నారు. అతనితోపాటు భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్ జట్టులో ఉన్నారు. ఆసియా కప్ కోసం టీమిండియాలో ఉన్న స్పెషలిస్ట్ పేసర్లు వీరు ముగ్గురే. వీరిలో భువీ, అర్షదీప్ ఎంపికపై ఎలాంటి అభ్యంతరం లేకున్నా.. ఆవేశ్ ఖాన్ ఎంపికను క్రికెట్ అభిమానులు తప్పుబడుతున్నారు. ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా ఆవేశ్ ఖాన్‌కు గత సిరీస్‌లతో చాలా అవకాశాలే ఇచ్చారు. అతను వాటిని అంతగా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆవేశ్‌ఖాన్ టీమిండియా తరపున ఇప్పటి వరకు 13 టీ20లు, ఒక వన్డే ఆడాడు. టీ20ల్లో 11 వికెట్లు మాత్రమే తీశాడు. వన్డేలో ఒక్క వికెట్ కూడా తీయకపోగా 9 ఎకనామీతో ఎక్స్‌పెన్సివ్‌గా నిలిచాడు. అలాగే టీ20ల్లో 8.67 ఎకనామీతో ఉన్నాడు. ఈ 13 మ్యాచ్‌ల్లో ఏ ఒక్క మ్యాచ్‌లోనూ అద్భుత ప్రదర్శన కనబర్చలేదు. ఇలాంటి సమయంలో మరి ఆవేశ్‌ఖాన్‌ను ఎందుకు జట్టులోకి తీసుకున్నారో అర్థం కావడం లేదంటూ క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు. ఆవేశ్ ఖాన్ స్థానంలో సిరాజ్నో, షమీనో తీసుకుని ఉంటే బాగుండేదంటూ అభిప్రాయపడతున్నారు. అలాగే ఆవేశ్ ఎంపికపై ఏమైనా లాబీయింగ్ జరిగిందా అనే అనుమానాలను సైతం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. 's #AsiaCup Squad pic.twitter.com/x63JDqkS3l — Cricbuzz (@cricbuzz) August 8, 2022 BCCI while selecting Avesh Khan for Asia Cup : #BCCI #AsiaCup #ViratKohli #ShreyasIyer pic.twitter.com/HbpASrsg8Y — Yogi Says (@imyogi_26) August 8, 2022 ఇది కూడా చదవండి: Asia Cup 2022: ఆసియా కప్‌కు జట్టును ప్రకటించిన BCCI.. సెలెక్టర్లపై తీవ్ర విమర్శలు