గంగూలీ కోసమే ఆట మార్చుకున్నా.. దాదాపై ప్రేమని బయటపెట్టిన వెంకటేశ్ అయ్యర్

venkatesh iyer

ఆడింది రెండో మ్యాచ్‌లు కానీ.. ఐపీఎల్‌ సెకెండాఫ్‌లో ఇప్పుడు బాగా వినిపిస్తున్న పేరు ‘వెంకటేశ్‌ అయ్యర్‌’. ఎంతో నైపుణ్యం ఉన్న ఆటగాడిగా వెంకటేశ్‌ అయ్యర్‌ ఆడుతున్న షాట్లు క్రికెట్‌ అభిమానులను అలరిస్తున్నాయి. ఏ బాల్‌నైనా బౌండిరీకే తరలించాలి అన్న చందంగా అతని బ్యాటింగ్‌ ఉంటోంది. కేకేఆర్‌ మంచి ఓపెనర్‌ దొరికేశాడు అని ఇప్పటికే అభిమానులు ఫిక్స్‌ అయిపోయారు. రెండో మ్యాచ్‌లోనే వెంకటేశ్‌ అయ్యర్‌ హాఫ్‌ సెంచరీతో అదరగొట్టాడు. రెండ్‌ మ్యాచ్‌లలో అతని స్ట్రైక్‌ రేట్‌(164.9) చూసి అందరూ షాక్ అవుతున్నారు.

తొలి మ్యాచ్‌లోనే అర్ధశతకం సాధించాల్సింది కానీ లక్ష్యం చిన్నది కావడంతో 41 నాటౌట్‌గా సరిపెట్టుకున్న వెంకటేశ్‌ అయ్యర్‌కు ముంబయిపై ఆ అకాశం దక్కింది. ఓపెనర్‌గా వచ్చిన వెంకటేశ్‌ అయ్యర్‌ 30 బంతుల్లో 3 సిక్సులు, 8 ఫోర్ల సాయంతో 53 పరుగులు చేశాడు. 11.4 ఓవర్‌లో జాస్ప్రిత్‌ బుమ్రా వేసిన స్లోవర్‌ బాల్‌కు బౌల్డ్‌ అయ్యాడు వెంకటేశ్‌ అయ్యర్‌. ఇంతటి స్టార్‌ ఎంతకు కొన్నారో అని అంచనాలు వేసుకోకండి.. వెంకటేశ్‌ అయ్యర్‌ను కోల్‌కతా రూ.20 లక్షల బేస్‌ ప్రైస్‌కు కొనుగోలు చేసింది. ఫస్ట్‌ హాఫ్‌లో అవకాశం దక్కక పోయినా కేకేఆర్‌ స్ట్రాటజీతో యూఏఈలో వెంకటేశ్‌ అయ్యర్‌ను ఓపెనర్‌గా పంపుతున్నారు. వాళ్ల లెక్క బాగానే కుదిరింది.

venkatesh Iyerసౌరవ్‌ గంగూలీకి వీరాభిమాని

ముంబయితో మ్యాచ్‌ తర్వాత వెంకటేశ్‌ అయ్యర్‌.. రాహుల్‌ త్రిపాఠితో ముచ్చటించాడు. అతని కెరీర్‌, రోల్‌ మోడల్‌ గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు. తాను సౌరవ్ గంగూలీకి వీరాభిమానిని అని గర్వంగా చెప్పుకొచ్చాడు. తాను ఐపీఎల్‌లో కోల్‌కతా తరఫున ఆడాలని బాగా కోరుకున్నాని అందుకు కారణం కూడా దాదానే తెలిపాడు. గంగూలీ కేకేఆర్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు.. అందుకే అతనికి కోల్‌కతా టీమ్‌ అంటే అంత ఇష్టమని చెప్పాడు. దాదాలో బ్యాటింగ్‌ చేసేందుకు.. గంగూలీ స్టైల్‌లో సిక్సులు కొట్టేందుకు తన బ్యాటింగ్‌ స్టైల్‌ను కూడా మార్చుకున్నట్లు వెంకటేశ్‌ అయ్యర్‌ వెల్లడించాడు. కేవలం దాదా స్టైల్‌ని ఫాలో అవ్వడానికే తన బ్యాటింగ్‌ స్టైల్‌ మార్చుకున్నట్లు స్పష్టం చేశాడు. వెంకటేశ్‌ అయ్యర్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేసి పెవిలియన్‌కు చేరే సమయంలో అందరూ స్టాండింగ్‌ ఓవేషన్‌ ఇచ్చారు.