టీ20 వరల్డ్‌ కప్‌ ధీమ్‌ సాంగ్‌ వచ్చేసింది.. కోహ్లీని ఓ రేంజ్‌లో చూపించారుగా

ICC Mens T20 World Cup 2021 Starts Oct 17 - Suman TV

ప్రస్తుతం ఐపీఎల్‌ జోరు కొనసాగుతుండగా దీని వెంటనే టీ20 వరల్డ్‌ కప్‌ రాబోతుంది. ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌ అక్టోబర్‌ 17న ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన యాంథమ్‌ ను ఐసీసీ తన ట్వీట్టర్‌ ఖాతాలో రిలీజ్‌ చేసింది. ‘లీవ్‌ ద గేమ్‌’ ‘లవ్‌ ద గేమ్‌’ ఆటలో జీవించండి.. ఆటను ప్రేమించండి అంటూ సాగే ఈ సాంగ్‌ అదిరిపోయింది. దీనికి యానిమేషన్‌ వీడియో జోడించారు. అందులో విరాట్‌ కోహ్లీ కవర్‌డ్రైవ్‌ను చూపించడంతో కోహ్లీ అభిమానులు తెగ సంబంరపడిపోతున్నారు. ఆ వీడియోను షేర్‌ చేస్తున్నారు.