ICC Mens FTP Schedule For 2023-27: ఐసీసీ పురుషుల క్రికెట్‌కు సంబంధించిన ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ (ఎఫ్టీపీ)ని బుధవారం విడుదల చేసింది. 2023 నుంచి 2027 కాలానికి గాను పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించింది. ఇందులో ద్వైపాక్షిక సిరీస్‌లతో పాటు 2023 వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ, రెండు టీ20 వరల్డ్‌కప్స్‌తో పాటు రెండు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఎడిషన్లు కూడా ఉన్నాయి. 2019-23 కాలంతో పోలిస్తే.. 2023-27 షెడ్యూల్లో మూడు ఫార్మాట్లోనూ మ్యాచ్‌ల సంఖ్య పెరిగింది. 2023-27 ఎఫ్టీపీ లో 780 మ్యాచ్‌లు ఉన్నాయి. వాటిలో 173 టెస్టులు, 281 వన్డేలు, 326 టీ20 మ్యాచ్‌లు ఉన్నాయి. ఇక ఆగస్టు 18, 2022 నుంచి ఫిబ్రవరి 2027 కాలంలో భారత్ 44 టెస్టులు, 63 వన్డేలు,76 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్(2023-25, 2025-27)లో భాగంగా రెండు ఎడిషన్‌లోనూ ఆస్ట్రేలియా,ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. అదే విధంగా 2023 వన్డే ప్రపంచకప్‌కు ముందు భారత్ 27 వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. 2023-27 వరకు భారత జట్టు ఆడబోయే మ్యాచులు.. స్వదేశీ(H) / విదేశీ(A) 2023: న్యూజిలాండ్ - జనవరిలో 3 వన్డేలు, 3 టీ20లు (H) ఆస్ట్రేలియా - జనవరిలో 4 టెస్టులు, 3 వన్డేలు (H) వెస్టిండీస్ - 2 టెస్టులు, 3 వన్డేలు, 3 టీ20లు జూలై (A) ఆస్ట్రేలియా - 3 వన్డేలు సెప్టెంబర్ (H) ఆస్ట్రేలియా - నవంబరులో 5 టీ20లు (H) దక్షిణాఫ్రికా - డిసెంబరులో 2 టెస్టులు, 3 వన్డేలు, 3 టీ20లు (A) 2024: ఇంగ్లాండ్ - జనవరిలో 5 టెస్టులు (H) శ్రీలంక - జూలై)లో 3 వన్డేలు, 3 టీ20లు (A) బంగ్లాదేశ్ - సెప్టెంబరులో 2 టెస్టులు, 3 టీ20లు (H) న్యూజిలాండ్ - అక్టోబరులో 3 టెస్టులు (H) ఆస్ట్రేలియా - నవంబరులో 5 టెస్టులు (A) 2025: ఇంగ్లాండ్ - జనవరిలో 3 వన్డేలు, 5 టీ20లు (H) ఇంగ్లాండ్ - జూన్ లో 5 టెస్టులు (A) బంగ్లాదేశ్ - ఆగస్టులో 3 వన్డేలు, 3 టీ20లు (A) వెస్టిండీస్ - అక్టోబరులో 2 టెస్టులు (H) ఆస్ట్రేలియా - అక్టోబరులో 3 వన్డేలు, 5 టీ20లు (A) దక్షిణాఫ్రికా - నవంబరులో 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు (H) 2026: న్యూజిలాండ్ - జనవరిలో 3 వన్డేలు, 5 టీ20లు(H) ఆఫ్ఘనిస్తాన్ - 1 టెస్టు, 3 వన్డేలు జూన్ (H) ఇంగ్లాండ్ - 3 వన్డేలు, 5 టీ20లు జూలైలో (A) శ్రీలంక - ఆగస్టులో 2 టెస్టులు (A) ఆఫ్ఘనిస్తాన్ - సెప్టెంబరులో 3 టీ20లు (A) వెస్టిండీస్ - 3 వన్డేలు, 5 టీ20లు సెప్టెంబర్ (H) న్యూజిలాండ్ - అక్టోబరులో 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు (A) శ్రీలంక - 3 వన్డేలు, 3 టీ20లు డిసెంబర్ (H) ఆస్ట్రేలియా - 2027 జనవరిలో 5 టెస్టులు (H) 2023-27 వరకు ఏయే జట్టు ఎన్ని మ్యాచులు ఆడనుందంటే.. టీమిండియా - 141 ఆస్ట్రేలియా - 132 ఇంగ్లాండ్ - 142 న్యూజిలాండ్ - 135 దక్షిణాఫ్రికా - 113 పాకిస్తాన్ - 130 బంగ్లాదేశ్ - 150 వెస్టిండీస్ - 147 శ్రీలంక - 131 ఆఫ్ఘనిస్తాన్ - 123 ఐర్లాండ్ - 110 జింబాబ్వే - 109 ఐసీసీ పూర్తి షెడ్యూల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇదీ చదవండి: ఆ విషయంలో నేను కూడా ధోనీ, కోహ్లీలలానే ఆడాను: జెమిమా రోడ్రిగస్ ఇదీ చదవండి: గదిలో అందరున్నా.. ఒంటిరిగా ఫీలయ్యా: విరాట్ కోహ్లీ