నాన్నంటే ఎంత ప్రేమో.. డుప్లెసిస్‌ కూతురి వీడియో వైరల్‌

మైదానంలో ఫీల్డింగ్‌ చేస్తున్న తండ్రిని చిన్ని గొంతుతో డాడీ.. డాడీ.. అని అరిచి పిలిచి.. నాన్న చూడగానే ముసిముసి నవ్వులతో మురిసిపోయిన చిన్నారి. సీరియస్‌గా జరుగుతున్న మ్యాచ్‌లో బౌండరీ వద్ద బంతికోసం కాపుకాస్తుండగా కూతురి పిలుపుతో ఉప్పొంగిన తండ్రి మనసు. చూడగానే మనసుకు హాయినిచ్చే కూతురి చిరునవ్వు చూసి మ్యాచ్‌లో ఒత్తిడిని మర్చిపోయిన అనుభూతి పొందింది ఇంకెవరో కాదు సౌతాఫ్రికా క్రికెటర్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఓపెనర్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌. సాధారణంగా ఆడపిల్లలకు నాన్నంటే ప్రత్యేకమైన ప్రేమ. తండ్రులే వాళ్ల సూపర్‌ హీరోలు. అలాగే డుప్లెసిస్‌ కూతురికి కూడా నాన్నంటే చాలా ఇష్టం.

Du Plessis Daughter Called him in the Ground - Suman TVసోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో బౌండరీ లైన్‌ వద్ద డుప్లెసిస్‌ ఫీల్డింగ్‌ చేస్తున్నాడు. ఆడియన్స్‌ గ్యాలరీలో డుప్లెసిస్‌ చిన్నారి కూతురు కూడా మ్యాచ్‌ చూస్తూ సీఎస్‌కే సపోర్ట్‌ చేస్తుంది. ఈక్రమంలో నాన్నను చూసిన కూతురు డాడీ.. డాడీ.. అంటూ పిలిచింది. దాంతో డుప్లెసిస్‌ కూతురి వైపు చూసి చేయి ఊపుతూ హాయి చెప్పాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. చిన్నారి ఎంత ముచ్చటగా నాన్నను పిలిచిదో చూడండి అంటూ కామెంట్లు చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో చెన్నై ఓడిపోయింది.

ఇదీ చదవండి: 2017లో దుబాయ్‌లో స్టోర్‌ కీపర్‌.. ఇప్పుడు CSKలో పేస్‌ బౌలర్‌.. ఇన్స్‌పైరింగ్‌ స్టోరీ!