తెలుగులో మాట్లాడి అదరగొట్టిన దినేష్‌ కార్తీక్‌.. వీడియో వైరల్‌

Dinesh Karthik Telugu Speech Viral Video - Suman TV

కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ ఆటగాడు దినేష్‌ కార్తీక్‌ తెలుగులో మాట్లాడి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాడు. శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు ఛానెల్ కోసం మాట్లాడిన డీకే.. ఎలాంటి తడబాటు లేకుండా స్పష్టంగా తెలుగు మాట్లాడారు. ప్రముఖ వాఖ్యాత, తెలుగువాడైన హర్షా భోగ్లే అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ.. డీకే అనర్గలంగా తెలుగులో మాట్లాడాడు. ఫైనల్‌ అని ఏమైనా ఒత్తిడి ఉందా అని హర్షా ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని, సాధారణ మ్యాచ్‌లానే ఈ మ్యాచ్‌నూ పరిగణిస్తున్నామని తెలిపాడు. అయితే ఫైనల్ మ్యాచ్‌ అంటే సహజంగా ఎవరికైన కాస్తో కూస్తో ఒత్తిడి ఉంటుందని, దాన్ని అధిగమించేందుకు ప్రాక్టీస్ చేశామని, సరైన ప్రణాళికలతో బరిలోకి దిగుతున్నామని చెప్పాడు. తమ జట్టు సెకండాఫ్‌లో అద్భుతంగా రాణించిందని, ఫైనల్‌కు చేరేందుకు ఆటగాళ్లు ఎంతో శ్రమించారని అన్నాడు.

ఇదీ చదవండి: కప్‌ గెలిచిన ధోనికి భార్య ఇచ్చిన అద్భుత గిఫ్ట్‌ ఏంటో తెలుసా?

Dinesh Karthik Telugu Speech Viral Video - Suman TVఈ సందర్భంగా డీకే.. కేకేఆర్‌ ఆటగాళ్లందరిపై ప్రశంసల వర్షం కురిపించాడు. కాగా, దినేశ్ కార్తీక్ తెలుగులో మాట్లాడటం పట్ల తెలుగు అభిమానులు ఫిదా అవుతున్నారు. డీకే అచ్చం తెలుగువాడిలా అద్భుతంగా మాట్లాడుతున్నాడంటూ సోషల్‌మీడియాలో వీడియోని షేర్‌ చేస్తూ ముచ్చటపడిపోతున్నారు. హర్షా భోగ్లే సైతం డీకేను మెచ్చుకుంటూ ట్వీట్ చేశాడు. తెలుగు ఇంటర్వ్యూ చేస్తానని కలలో కూడా ఊహించలేదని అన్నాడు. ఇదిలా ఉంటే, డీకే.. 2020 ఐపీఎల్‌ సందర్భంగా కూడా తెలుగులో మాట్లాడి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.