మ్యాచ్‌లో ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మాక్స్వెల్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నా.. వారిని వెనక్కు నెట్టి మరీ ఒక యంగ్ క్రికెటర్ మెరుపులు మెరిపించాడు. బంతి దొరికితే సిక్సు కొట్టాలనే కసితో ఆడి.. లీగ్‌లోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ది హండ్రెడ్ లీగ్ క్రికెట్ టోర్నీ-2022లో భాగంగా నార్తర్న్ సూపర్ ఛార్జర్స్, లండన్ స్పిరిట్ జట్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఈ సంచల ఇన్నింగ్స్ సాక్షాత్కరమైంది. ఇంగ్లండ్‌కు చెందిన ఆడమ్ రోసింగ్టన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో తొలుత సూపర్‌చార్జర్స్ తరఫున ఫాఫ్ డుప్లెసిస్ 35 బంతుల్లో 56 పరుగులు చేయగా, ఆడమ్ హోసీ కూడా 14 బంతుల్లో 30 పరుగులు చేశాడు. దీంతో సూపర్ ఛార్జర్స్ నిర్ణీత 100 బంతుల్లో 143 పరుగులు చేసింది. ఇక లండన్ జట్టులో గ్లెన్ మాక్స్వెల్, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉండడంతో అందరి దృష్టి వారిపైనే ఉంది. అందుకు తగ్గట్లే మ్యాక్సీ కూడా చెలరేగి ఆడాడు. అయితే అతని కంటే ముందు ఆడమ్ రోసింగ్టన్ బౌలర్లను ఊచకోత కోశాడు. 29 ఏళ్ల ఈ ఇంగ్లిష్ బ్యాటర్ డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్, డ్వేన్ బ్రావో వంటి స్టార్ బౌలర్లను చిత్తు చిత్తు చేశాడు. కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. దీంతో హండ్రెడ్ చరిత్ర లీగ్ అత్యంత వేగవంతమైన ఫిఫ్టీ కొట్టిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. మొత్తం 25 బంతుల్లో 7 సిక్సర్లు, 3 ఫోర్ల సహాయంతో 66 పరుగులు చేసిన ఆడమ్.. చివరి 10 బంతుల్లో 54 పరుగులు చేయడం విశేషం. అలాగే తొలి ఓవర్ చివరి రెండు బంతులను ఫోర్లు బాదిన రోసింగ్టన్ రెండో ఓవర్ తొలి బంతిని డాట్‌గా ఆడి తర్వాతి నాలుగు బంతుల్లో 4,6,6,6 విధ్వంసం సృష్టించాడు. వంద బంతుల ఇన్నింగ్స్‌లో ఒక బౌలర్ ఐదు బంతులను మాత్రమే వేస్తారు. ఐదు బంతుల తర్వాత స్ట్రైక్ చేంజ్ అవ్వద్దు. దీంతో రోసింగ్టన్ 7 బంతుల్లో 30 పరుగులు చేసి దుమ్మురేపాడు. రోసింగ్టన్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన మ్యాక్సీ 25 బంతుల్లో 43 పరుగులు చేశాడు. తద్వారా 82 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించి 7 వికెట్ల తేడాతో లండన్ స్పిరిట్ విజయం సాధించింది. మరి ఈ మ్యాచ్‌లో రోసింగ్టన్ ఇన్నింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. Adam Rossington scored a fifty in 15 BALLS today ... including FOUR CONSECUTIVE sixes #TheHundred LIVE https://t.co/NPFZKnGuCF pic.twitter.com/EUdFtE8DsO — ESPNcricinfo (@ESPNcricinfo) August 14, 2022 ఇది కూడా చదవండి: మరోసారి పవర్ హిట్టింగ్తో రెచ్చిపోయిన పుజారా! వరుసగా రెండో సెంచరీ