రాజకీయాలు, రాజ్యసభ సీటుపై స్పందించిన చిరంజీవి

మెగాస్టార్‌ చిరంజీవికి ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి రాజ్యసభ సీటు ఆఫర్‌ చేశారని, ఆయన త్వరలోనే రాజ్యసభలోకి మళ్లీ అడుగుపెడుతున్నారనే వార్తలు ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో దావానంలా వ్యాపించాయి. దీంతో ఏపీ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కాగా ఈ వార్తలపై తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి స్పందించారు. ఉదయం కుటుంబసభ్యులతో కలిసి భోగిని జరుపుకున్న చిరంజీవి సాయంత్రం.. ఎయిర్‌పోర్టులో రాజ్యసభ సీటుపై మీడియా ప్రశ్నించగా స్పందించారు.

తాను ఎవరూ తనకు రాజసభ్య సీటు ఆఫర్‌ చేయలేదని, ఆ వార్తలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో సినిమా టిక్కెట్లు వివాదానికి ఒక పరిష్కారం కోసం సీఎం జగన్‌ ఆహ్వానం మేరకు ఆయన క్యాంప్‌ ఆఫీస్‌కు వెళ్లిన చిరు సినిమా టిక్కెట్ల ధరలపై జగన్‌తో చర్చించారు. కాగా జగన్‌ చిరంజీవికి రాజ్యసభ సీటు ఆఫర్‌ చేసినట్లు, అందుకు చిరంజీవి కూడా ఓకే అన్నట్లు పుకార్లు వచ్చాయి. ఇప్పుడు చిరంజీవి ఖండనతో వాటికి తెరపడింది. మరి చిరంజీవి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.