కాగజ్‌నగర్ అడవుల్లో అరుదైన జింక.. దీని ప్రత్యేకత ఎంటో తెలుసా?

తెలంగాణలోని కొమురంభీం జిల్లా కాగజ్‌నగర్ అటవీ ప్రాంతంలో అరుదైన మొరిగే జింక (బార్కింగ్ డీర్) కనిపించింది. తెలంగాణలో 15 ఏళ్లుగా కనుమరుగైన జింక జాతుల్లో ఒకటైన బార్కింగ్‌ డీర్‌. కొమురంభీం జిల్లా కాగజ్‌నగర్ అడవుల్లో అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన కెమెరాకు ఇది చిక్కింది. బార్కింగ్ డీర్‌నే ఇండియన్ మంట్‌జాక్ అని కూడా పిలుస్తారు. దీని ప్రత్యేకత ఏంటంటే తోటి జంతువులు ప్రమాదంలో పడినప్పుడు ఇది కుక్కలా మొరిగి వాటిని హెచ్చరిస్తుంది. అందుకనే దీనిని మొరిగే జింక అని పిలుస్తారు.

ఇది చదవండి : సంక్రాంతి పండగ వేళ.. భారీగా తగ్గిన వంట నూనే ధరలు

deer minబార్కింగ్‌ డీర్‌ జనావాసాలకు అతి దూరంగా, దట్టమైన అడవుల్లోనే నివసిస్తుందన్నారు. ముఖ్యంగా దేశంలోని పశ్చిమ కనుమల్లో, హిమాలయాల సమీపంలో ఇవి కనిపిస్తుంటాయి. కాగా, 15 ఏళ్ల క్రితం నల్లమల అడవుల్లో బార్కింగ్ డీర్ కనిపించింది. ఆ తర్వాత దీని జాడ ఎక్కడా కనిపించలేదు. ఇన్నాళ్లకు మళ్లీ ఇది కనిపించడంతో అటవీ అధికారులతోపాటు వన్యప్రాణి ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.