కిన్నెర మొగిలయ్య.. 12 మెట్ల కిన్నెరను వాయించుకుంటూ తాత ముత్తాల నుంచి వస్తున్న కళకు ప్రాణం పోస్తున్నాడు. జీవితంలో ఎన్నో కష్టాలు పడినా కూడా ఆ కిన్నెరను, తన పాటను మాత్రం బతికిస్తూ వస్తున్నాడు. తిండికి, పిల్లల పోషణకు డబ్బు రాకపోయినా కూడా ఆ కిన్నెరను మాత్రం వదిలిపెట్టలేదు. తాను నమ్ముకున్న కిన్నెర వల్లే మొగిలయ్యకు కొత్త జీవితం లభించింది. ఇటీవల పద్మశ్రీ కూడా వచ్చింది. తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్ లో 300 గజాల ఇంటిస్థలం, ఇల్లు కట్టుకునేందుకు కోటి రూపాయల ఆర్థిక సాయం కూడా చేశారు. అయితే ప్రస్తుతం ఆ కోటి రూపాయల విషయంలో పెద్ద వివాదమే నడుస్తోంది. విసిగిపోయిన మొగిలయ్య దేశంలో నాలుగో అత్యున్నత పురస్కారం అయిన పద్మశ్రీనే వెనక్కి ఇచ్చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
విషయం ఏంటంటే.. గతంలో ఊరు ఊరు తిరిగి కిన్నెర వాయిస్తూ మొగిలయ్య పొట్టపోసుకునేవాడు. అప్పట్లో ఆయనకు అనుకున్న గుర్తింపు లేదనే చెప్పాలి. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొగిలయ్యకు ఉగాది పురస్కారం లభించడం, ఆ తర్వాత కాస్త గుర్తింపు పెరగడం చూశాం. ఇటీవల భీమ్లానాయక్ సినిమాలో కిన్నెర మొగిలయ్య పాట పాడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మొగిలయ్య పేరు తెలుగు రాష్ట్రాల్లో మారు మ్రోగింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. సీఎం కేసీఆర్ హైదరాబాద్ లో 300 గజాల ఇంటి స్థలం, కోటి ఆర్థికసాయం కూడా చేశారు. ఇప్పుడు ఆర్థిక సాయం విషయంలో స్థానిక రాజకీయ నాయకులతో మొగిలయ్యకు ఇబ్బందులు వస్తున్నాయని ఆరోపిస్తున్నాడు.
ఇదీ చదవండి: పెళ్లి బరాత్‌లో.. కర్రసాముతో కిర్రెక్కించిన రేవంత్ రెడ్డి!కొందరు బీజేపీ నాయకులు తనతో వాదనకు దిగినట్లు మొగిలయ్య ఆరోపించాడు. బీజేపీ ప్రభుత్వం వల్లే తనకు గుర్తింపు వచ్చిందని, పద్మశ్రీ కూడా దక్కిందని గొడవకు దిగినట్లు తెలిపాడు. కేసీఆర్ ఇస్తానన్న కోటి ఆయన జేబులోంచి ఇస్తున్నాడా అంటూ ప్రశ్నించినట్లు తెలియజేశాడు. ఆ విషయంలో కలతచెందిన కిన్నెర మొగిలయ్య పద్మశ్రీ పురస్కారాన్ని తిరిగి ఇచ్చేస్తానంటూ వ్యాఖ్యలు చేశాడు. ‘నన్ను ఏ ప్రభుత్వమూ ఆదుకోలేదు.. తెలంగాణ ఏర్పడ్డాక ఏడేళ్ల క్రితం కేసీఆర్ ఉగాది పురస్కారంతో సత్కరించారు. నేను ఇటీవల సినిమాలో పాట పాడితే మంచి గుర్తింపు, పద్మశ్రీ కూడా ఇచ్చారు. అది బీజేపీ వాళ్లు ఇచ్చారంట నాతో గొడవకు దిగారు. కోటి రూపాయలు కేసీఆర్ జేబులోంచి ఇస్తున్నారా అంటూ అడుగుతున్నారు. కేసీఆర్, మా ఎమ్మెల్యే నాకు సాయం చేస్తున్నారు. నన్ను బద్నాం చేయకండి. నా జీవితంలో మన్ను పోస్తే మీకు పాపం తగుల్తది’ అంటూ మొగిల్య భావోద్వేగానికి గురయ్యాడు. కిన్నెర మొగిలయ్య పద్మశ్రీ వెనక్కి ఇచ్చేస్తా అనడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: లక్కీ ఛాన్స్ కొట్టేసిన విశ్వక్ సేన్! గుడ్ న్యూస్ చెప్పేసిన హీరో అర్జున్
ఇదీ చదవండి: గెటౌట్ అంటూ దేవి నాగవల్లిపై నరేష్ స్కిట్.. అనిల్ రావిపూడి రియాక్షన్ వైరల్!