బెల్లి డ్యాన్స్ తో రికార్డులు బద్దలు కొడుతున్న నోరా ఫతేహి

ఫిల్మ్ డెస్క్- నోరా ఫతేహి.. బెల్లీ డ్యాన్స్ కు పెట్టింది పేరు. నోరా బెల్లి స్టెప్స్ కు సెలబ్రెటీల నుంచి మొదలు సామాన్యుల వరకు అంతా ఫిదా అవ్వాల్సిందే. అందుకే నోరా ఫతేహి డ్యాన్స్ కు టాలీవుడ్ నుంచి మొదలు హాలీవుడ్ వరకు చాలా మంది అభిమానులున్నారు. నోరా ఒక్కో స్టెప్పు గుండెల్లో గుబులు పుట్టిస్తుందని అంటారు చాలా మంది ఫ్యాన్స్.

నోరా ఫతేహి తాజాగా నటించిన హిందీ మూవీలోని ఐటెం సాంగ్‌ తో రికార్డ్ బద్దలు కొడుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం నటిస్తున్న లేటెస్ట్ మూవీ సత్యమేవ జయతే 2. 2018 లో విడుదలై సూపర్ హిట్‌ గా నిలిచిన సత్యమేవ జయతే కి ఇది సీక్వెల్‌ గా వస్తోంది. స్తమేవ జయతే కు దర్శకత్వం వహించిన మిలప్ ఝవేరి ఈ సీక్వెల్‌ను కూడా తెరకెక్కిస్తున్నారు.

nora fatehi

సత్యమేవ జయతే-2 మూవీలో దివ్య కోష్లా కుమార్ హీరోయిన్ నటిస్తోంది. ఈ సినిమాలో నోరా ఫతేహి ఓ ఐటెం సాంగ్ చేసింది. ఈ పాటకు సంబంధించిన చిన్న వీడియోను తన ఇన్స్టాగ్రాంలో షేర్ చేసింది నోరా. ఎప్పటిలాగే తన బెల్లీ డాన్స్‌ తో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతోంది. ఈ సాంగ్ ప్రోమో వీడియో కేవలం 24 గంటల్లోనే 25 మిలియన్ల వ్యూస్ రాబట్టి సరికొత్త రికార్ద్‌ను క్రియేట్ చేసింది.

సత్యమేవ జయతే లో ఉన్న దిల్‌ బర్ దిల్‌ బర్ సాంగ్ రీమేక్ కంటే ఇది మరో లెవల్ అని అభిమానులు అంటున్నారు. అన్నట్లు నోరా ఫతేహి తెలుగులో బాహుబలి, టెంపర్, లోఫర్, ఊపిరి తదితర సినిమాల్లో ఐటెం సాంగ్స్‌ తో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది. ఈ భామ ఒక్కో ఐటెం సాంగ్ కు సుమారు కోటి రూపాయల పారితోషికం తీసుకుంటుందని ఫిల్మ్ నగర్ టాక్.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi)