ఆమెతో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న నితిన్

ఫిల్మ్ డెస్క్- హీరో నితిన్ సినిమాల నుంచి కాస్త రెస్ట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో రిలాక్స్ అవ్వడానికి మాల్దీవులను ఎంచుకున్నారు నితిన్. ఇక మాల్దీవులను ఒక్కడే ఎలా వెళ్తాడు చెప్పండి.. ఎంచక్కా తన సతీమణి షాలినితో కలిసి మాల్దీవులకు చెక్కేశారు నితిన్. ఇంకేముంది అక్కడ భార్య షాలినితో ఎంజాయ్ చేస్తున్నాడు. సముద్రం అంచున ప్రతృతి అందాలను భార్యా, భర్తలిద్దరు ఆస్వాదిస్తున్నారు.

హీరో నితిన్ షాలినీ పెళ్లి జరిగి సరిగ్గా సంవత్సరం జరిగింది. గత సంవత్సరం జూలై 26న ఈ ఇద్దరూ వివాహం చేసుకున్నారు. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుందామని అనుకున్న నితిన్ కు కరోనాతో నిరాశే ఎదురైంది. తన పెళ్లిని ఘనంగా చేసుకోవాలని నితిన్ దుబాయ్‌లో భారీ ఏర్పాట్లు చేసుకున్నారు. ఐతే కరోనా కారణంగా అవన్నీ వర్కవుట్ కాలేదు.

Nithin And shalini 1

కరోనా నిబంధనలను మేరకు నితిన్ తన స్నేహితురాలు, ప్రియురాలైన షాలినీని అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఇక నితిన్, షాలిని పెళ్లి జరిగి సంవత్సరం పూర్తైన నేపధ్యంలో ఈ జంట మాల్దీవుల్లో యానివర్సరీని జరపుకుంటున్నారు. ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ అంటూ నితిన్, షాలిని సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌లు సందడి చేస్తున్నాయి.

నా జీవితాన్ని ఎంతో ఆనందంగా, సంతోషంగా మలిచావ్, నా జీవితాంతం నీతోనే గడపాలని ఉంది.. అంటూ తన భార్యపై నితిన్ ప్రేమను వ్కక్తం చేయగా, ఇప్పడు ఎప్పుడూ ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అని షాలినీ భర్తపై ప్రేమను కురిపించింది. మరి మనం కూడా నితిన్, షాలిని జంటకు శుభాకాంక్షలు చెబుదామా..

 

View this post on Instagram

 

A post shared by Shalini Kandukuri (@shalinikandukuri)