పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా సంక్రాతి బరి నుంచి తప్పుకొన్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఆర్‌ఆర్‌ఆర్ రిలీజ్ అవుతుండటంతో.. రెండు క్లాష్ కాకుడదని భావించి.. మేకర్స్ భీమ్లానాయక్ చిత్రాన్ని ఫిబ్రవరి 25కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయంపై తాజాగా నిహారిక స్పందించారు. ఎప్పుడు రిలీజ్ అయినా సరే భీమ్లానాయక్ సూపర్‌హిట్ అవుతుందని తెలిపారు.
నిహారిక మాట్లాడుతూ.. ‘పోస్ట్ పోన్ అయ్యింది సినిమా రిలీజ్ మాత్రమే.. రిజల్ట్ కాదు. సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా సూపర్ హిట్టే. మా బాబాయ్ ఓ సినిమాలో చెప్పినట్లు.. రావడం కాస్త లేటవ్వొచ్చు.. కానీ రావడం మాత్రం పక్క. అలానే సినిమా విడుదల కాస్త ఆలస్యం కావొచ్చు.. కానీ బాక్సాఫీస్ బద్దలు కావడం పక్కా’ అన్నారు.