మోదీ సర్కారు సంచలన నిర్ణయం.. పంజాబ్ ఎన్నికల వ్యూహమేనా?

ప్రధాని నరేంద్ర మోదీ.. వెన్నుచూపని ధీరుడు, సూరుడని దేశ వ్యాప్తంగా బీజేపీ నేతలు కొనియాడుతుంటారు. అయితే ఉన్నట్టుండి మోదీ సాగు చట్టాల విషయంలో వెనకడుగు వేయటానికి అసలు కారణం ఏదైన దాగి ఉందా అని దేశ పౌరులు తమ ఆలోచనలకు పదును పెడుతున్నారు. ఏడాదిన్నర సుధీర్ఘకాలం పాటు సాగిన రైతుల దీక్షనే చట్టాల రద్దుకు కారణమని కొందరు పెదవి విప్పుతుంటే కాదు.. కాదు.. రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలే మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు అసలు కారణమని ప్రతిపక్షాలు గొంతులు పగిలేలా అరుస్తున్నాయి.

ఇదీ చదవండి: మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు కేంద్రం అంగీకారం.. అసలు వ్యవసాయ చట్టాల్లో ఏముంది?

కాగా చట్టాల రద్దు విషయంలో ఇంత కాలం మౌన పోరాటం చేసిన ప్రధాని సడెన్ గా ఈ నిర్ణయం తీసుకోవటం కాస్త ఆలోచింపజేస్తోంది. ఇక నిజంగానే మోదీ రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల కారణంగానే ఈ చట్టాలను రద్దు చేశారా అనేది ప్రశ్నార్ధకంగా మారుతోంది. అయితే శుక్రవారం జాతినుద్దేశించి మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ రైతులకు వ్యతిరేకంగా మారిన ఈ చట్టాలను రద్దు చేస్తున్నామని, ఈ కారణంగా ఇబ్బంది పడ్డ రైతులను మోదీ క్షమాపణలు కోరారు.

Narendra Modi about Farmers - Suman TVఇక రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఈ చట్టాలు రద్దు దిశగా నిర్ణయాలు తీసుకుంటామని ప్రధాని తెలిపారు. అయితే ఉన్నట్టుండి ప్రధాని ఈ నిర్ణయం తీసుకోవటం వెనుక ఏదైన వ్యూహం దాగి ఉందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వచ్చే ఏడాదిలో పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్, మణీపూర్, గోవా, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ద్రుష్ట్యా ప్రధాని ఈ వ్యూహాన్ని ఎంచుకున్నట్లు తెగ చర్చ జరుగుతోంది. అయితే ఇటీవల ప్రధాని పంజాబ్ బీజేపీ నేతలతో సమావేశాలు కూడా జరపడం ఈ నిర్ణయానికి బలం చేకురుస్తోంది.

Narendra Modi about Farmers - Suman TVఇక దేశ వ్యాప్తంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ హవా తగ్గుతుండడంతో కాస్త వెనక్కి తగ్గి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా పంజాబ్ లో తుడిచిపెట్టుకుపోతున్న బీజేపీ ఉనిఖిని కాపాడేందుకు కూడా ఈ నిర్ణయం కలిసి వస్తుందనే కారణంతోనే మోదీ ఈ దిశగా అడుగుల వేశారా? అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఏదేమైన ఇన్నాళ్ల పాటు రైతుల చేసిన పోరాటానికి ఫలితం మాత్రం దక్కిందనే చెప్పాలి. మరి మోదీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందో లేదో చూడాలి. నూతన వ్యవసాయ చట్టాల రద్దు.. ఎన్నికల వ్యూహమేనా? మీ అభిప్రాయాలను కామెంట్‌ చేయండి.