ఏ ఫీల్డ్ లో ఉన్న వాళ్లు.. అదే ఫీల్డ్ లో ఉన్న వాళ్లను వివాహం చేసుకోవడం కొత్తేం కాదు. అలాగే రాజకీయాల్లోనూ ఓ ఇద్దరూ పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు. అందులో వింతేమీ లేదు. కానీ, వారి పెళ్లి పిలుపు మాత్రం దేశవ్యాప్తంగా పొగడ్తలు, ప్రశంసలు అందుకుంటోంది. అంతగా అందులో ఏముంది? అసలు వాళ్లు అంత ఆదర్శంగా ఏం చేయబోతున్నారో చదివి తెలుసుకోండి.. ఆర్య రాజేంద్రన్.. ఈమె కేరళలోని తిరువనంతపురం మేయర్. రెండేళ్ల క్రితం ఈమె పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగింది. విద్యార్థినిగా ఉన్న సమయంలోనే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించింది. అంతేకాకుండా దేశంలోనే అతి పిన్న వయస్కురాలైన మేయర్ గా రికార్డుల కెక్కింది. ఇప్పుడు ఆమె వివాహం కూడా అంతే హాట్ టాపిక్ గా మారింది. ఆమె సచిన్ దేవ్ అనే ఓ ఎమ్మెల్యేని వివాహం చేసుకోబోతోంది. సచిన్ దేవ్ కూడా అక్కడ బాగా ఫేమస్ అనే చెప్పాలి. ఎందుకంటే సచిన్ ప్రముఖ నటుడు ధర్మజన్ బోల్గట్టిపై పోటీ చేసి నెగ్గాడు. వీళ్లు చిన్నప్పటి నుంచి మంచి మిత్రులు, కలిసి ఎస్ఎఫ్ఐలో పని చేశారు. అక్కడి నుంచే వీరి అభిరుచులు, ఆలోచనలు ఒకటై వారి మధ్య మంచి బంధం ఏర్పడింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. సామాన్యులుగా ఉన్న వీళ్లు అనుకున్నది సాధించి సెలబ్రిటీలుగా ఎదిగారు. ఇప్పుడు వీరి వివాహంతో మరింత ఆదరణ సొంతం చేసుకోబోతున్నారు. వీరు పెళ్లిచేసుకోబోతున్నట్లు ఫేస్ బుక్ లో పెట్టిన ఒక పోస్టు సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. అదేంటంటే.. "మేము సెప్టెంబర్ నెల 4వ తేదన ఉదయం 11 గంటలకు తిరువనంతపురంలోని ఏకేజీ హాల్ లో పెళ్లి చేసుకోబోతున్నాం. మాకు సాధ్యమైనంత వరకు అందరినీ మా వివాహానికి ఆహ్వానించాం. ఇంకా ఎవరినైనా ఆహ్వానంచడం మరిచిపోతే దీనినే మా ఆహ్వానంగా భావించి.. తప్పకుండా మా పెళ్లికి వచ్చి మమ్మల్ని ఆశ్వీర్వదించండి. మేము ఎలాంటి బహుమతులను స్వీకరించము. దీనిని మా రిక్వెస్ట్ గా మీరు భావించాలి” అంటూ ఆర్య రాజేంద్రన్ పోస్టు చేశారు. ఆ పోస్టును ఎమ్మెల్యే సచిన్ దేవ్ సైతం షేర్ చేశాడు. ఇప్పుడు నెట్టింటి వీరి వివాహ ఆహ్వానంపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఒక మేయర్, ఎమ్మెల్యే పెళ్లంటే అంగరంగ వైభవంగా చేసుకుంటారు. అలాంటిది వీళ్లు మాత్రం ఎంతో సింపుల్ గా చేసుకునేందుకు సిద్ధమయ్యారు. అందులోనూ ఎలాంటి బహుమతులు తీసుకురాకండని ముందే చెబుతున్నారు. వారి సింప్లిసిటీ నిజంగా గ్రేట్ అంటూ కామెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా వీరు ఎంతోమందికి ఆదర్శం అంటూ చెబుతున్నారు. ఆర్య రాజేంద్రన్- సచిన్ దేవ్ వివాహ ఆహ్వానంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: నెలసరి నొప్పులతో పురుషుల ఆర్తనాదాలు.. ఎందుకంటే? ఇదీ చదవండి: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్.. సెప్టెంబర్ లో సెలవులు..ఎన్ని రోజులంటే?