నేటికాలంలో ఏటీఎమ్ మిషన్లు, నెట్ బ్యాకింగ్ సేవలు వచ్చిన తరువాత దాదాపు చాలా మందికి బ్యాంకు వెళ్లే అవసరం చాలా తక్కువగా ఉంటుంది. అయితే కొన్ని కొన్ని అవసరాల నిమిత్తం అప్పుడప్పుడు బ్యాంకు వెళ్తుండాలి. మరి కొందరు వ్యక్తిగత పనుల నిమిత్తం నిత్యం బ్యాంకు వెళ్తుంటారు. అయితే ఇలా వెళ్లాలనుకునే వారు ముందుగా ప్లాన్ చేసుకోవాలి. ఆగస్టు నెల ముగిసింది. సెప్టెంబర్ లో కూడా చాలా రోజులు బ్యాంకులకు సెలవులు వస్తున్నాయి. కాబట్టి బ్యాంకుల్లో పని ఉంటే ముందే ప్లాన్ చేసుకోండి. లేదంటే కొన్ని సందర్భాల్లో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) విడుదల చేసిన హాలిడే క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ నెలలో 14 రోజులు సెలవులు ఉన్నాయి. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. సెప్టెంబర్ నెలలో శని, ఆదివారాలతో కూడిన సెలవులు 6 ఉన్నాయి. ఇవి కాకుండా ప్రత్యేక సెలవులు 8 ఉన్నాయి. ఇవి రెండు కలుపుకుని సెప్టెంబర్ నెలలో మొత్తం 14 రోజులు బ్యాంకులు మూత పడనున్నాయి. అయితే ఈ 14 రోజులు సెలవు దేశమంతటా ఒకేలా ఉండావు. వేరువేరు రాష్ట్రాలో వేర్వేరుగా సెలవులు ఉంటాయి. ఆయా రాష్ట్రాల్లోని స్థానిక పండగలు, ప్రత్యేక సందర్భాలను బట్టి ఉంటాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు మాత్రం కేవలం రెండో, నాలుగో శని వారం, నాలుగు ఆదివారాలు కలిపి మొత్తం 6 మాత్రమే సెప్టెంబర్ నెల సెలవుగా ఉన్నాయి సెప్టెంబర్‌లో హైదరాబాద్ సర్కిల్‌లో పండుగలు, పర్వదినాలు ఏవీ లేకపోవడంతో ఇతర ప్రత్యేక సెలవు ఏమిలేవు. కానీ ఇతర సర్కిళ్లల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.. సెప్టెంబర్1 గోవాలో వినాయక చవతి సెప్టెంబర్ 6న జార్ఖండ్ లోని రాంచిలో కర్మపూజ సెప్టెంబర్ 7న కేరళలో ఫస్ట్ ఓనమ్ సెప్టెంబర్ 8న కేరళలో తిరువోనం సెప్టెంబర్ 9వ తేదీ సిక్కిం లో ఇంద్రజాత్ర సెప్టెంబర్ 10న కేరళలో శ్రీ నరవణ గురు జయంతి సెప్టెంబర్ 21న కేరళలో శ్రీనారాయణ గురు సమాధి దినం సెప్టెంబర్ 26న మణిపాల్ లో నవరాత్రి స్థాపన పండగ. ఇలా అన్ని రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా బ్యాంకులకు 14 రోజులు సెలవు ఉన్నాయి. ముఖ్య విషయం ఏంటంటే ఈ సెలవులు అన్ని రాష్ట్రాల్లో ఉండవు. రాష్ట్రాలను బట్టి బ్యాంకులు మూసి ఉంటాయని వినియోగదారులు గమనించాలి. బ్యాంకులు మూసి ఉన్నప్పుడు ఖాతాదారులు ఆన్‌లైన్ బ్యాంకింగ్, నెట్‌బ్యాంకింగ్, యూపీఐ, నెఫ్ట్ లాంటి సేవలు వాడుకోవచ్చు. ఇక సెప్టెంబర్ నెలకు సంబంధించి బ్యాంకుల సెలవుల వివరాలకో సం ఆర్బీ అధికారిక వెబ్ సైట్ లో చూడవచ్చు.