సాధారణంగా ఎక్కడైన డిస్కౌంట్ అంటే జనం ఎగబడుతుంటారు. ఈ డిస్కౌంట్ అనేది చిన్న షాపుల నుంచి మొదలు కొన్ని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో కూడా ఉంటుంది. అయితే కొన్ని చికెన్ సెంటర్లు కూడా డిస్కౌంట్ తో చికెన్ విక్రయిస్తుంటారు. అలానే ఓ వ్యక్తి.. ఎప్పుడూ కళ్లు చెదిరే తగ్గింపు ధరలతో చికెన్ విక్రయించే వాడు. దీంతో జనం ఎగబడే వారు. తోటి షాపుల వాళ్లకు ఏమి అర్ధమయ్యేది కాదు. మొన్న జరిగిన బక్రీద్ పండుగ నాడు కూడా చికెన్‌పై అదిరిపోయే డిస్కౌంట్లు ప్రకటించాడు సదరు వ్యక్తి. అంతే! ఇంకేముంది అతడి చికెన్ క్షణాల్లో అమ్ముడు పోయింది. అనుమానం వచ్చిన తోటి షాపుల వాళ్లు నిఘపెట్టి షాకింగ్ విషయాలు తెలుసుకున్నారు. ఇంతకీ ఆ కథేంటంటే..? కేరళలోని వట్టంకులం అనే ప్రాంతంలో అఫ్జల్ అనే 31 ఏళ్ల వ్యక్తి స్థానికంగా చికెన్ షాప్ నడుపుతున్నాడు. ఎప్పుడూ చూడు తన షాప్ కు వచ్చిన కస్టమర్లకు అదిరిపోయే తగ్గింపు ధరలకు చికెన్ విక్రయిస్తూ వచ్చాడు. దీంతో పక్క షాపుల వాళ్లకి కస్టమర్లు తగ్గిపోయారు. దీంతో వాళ్లు కూడా డిస్కౌంట్ పెట్టారు. అయితే అఫ్జల్ చికెన్ ధరను ఇంక తగ్గించాడు. బక్రీద్ ఫెస్టివల్ సమయంలో కూడా రూ.10 నుంచి రూ.20 వరకు చికెన్ పై డిస్కౌట్ ప్రకటించాడు. దీంతో ఒక్కసారిగా అతడి షాప్ రద్దీగా మారి.. స్థానికంగా ఉండే మిగతా చికెన్ షాపులు విలవిలలాడాయి. అసలే తక్కువ ధరలు.. ఆపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు.. అయినా అఫ్జల్ కి లాభం ఎలా వస్తుంది?అని మిగతా షాప్ యజమానులకు సందేహం వచ్చింది. దీనితో వారంతా కలిసి కూపీ లాగగా.. అసలు విషయం బయటపడింది. రిమోట్ కంట్రోలర్ ద్వారా తన తూకాన్ని తారుమారు చేస్తూ.. కస్టమర్లను అప్జల్ మోసం చేస్తున్నాడని గుర్తిస్తారు. అతడ్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కాగా, అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడ్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: వీడియో: ఆవు ఒడిలో సేద తీరుతున్న బాలుడు! ఇదీ చదవండి: Brimato: టమాటా లాంటి వంకాయని చూశారా? అదికూడా టమాటా చెట్టుకే! ఇదీ చదవండి: భర్త టీనేజ్ బాలికను అత్యాచారం చేస్తుండగా వీడియో తీసిన భార్య!