Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఘోరం.. వేటగాళ్ల కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతి..!

మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో దారుణం జరిగింది. సాగా బర్ఖెడ సమీపమాలోని అడవిలో కృష్ణజింకల వేటకు వచ్చిన వేటగాళ్లను.. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, వేటగాళ్లకు మధ్య శుక్రవారం అర్ధరాత్రి కాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల్లో సబ్-ఇన్‌స్పెక్టర్ రాజ్‌కుమార్ జాతవ్, హెడ్ కానిస్టేబుల్ సంత్ రామ్ మీనా, కానిస్టేబుల్ నీరజ్ భార్గవ అనే ముగ్గురు పోలీసు అధికారులు మృతి చెందారు. గత కొంత కాలంగా అడవిలో వేటగాళ్ల సంచారం ఎక్కువ అయ్యిందని.. ఈ విషయం పై పోలీసులు నిఘా పెట్టినట్లు సమాచారం.

ఇది చదవండి: Shrihan: సిరిని అర్ధం చేసుకోవడం చాలా కష్టం.. శ్రీహాన్ ఎమోషనల్ వీడియో!

image 1 compressed 53అడవిలో వేటగాళ్లు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు సాగా బర్ఖెడ గ్రామ పరిధిలో తనిఖీలు చేస్తున్న పోలీసులపై అకస్మాత్లుగా వేటగాళ్లు కాల్పులు జరిపారు. ఒక్కో మృతదేహాన్ని 12-15 బుల్లెట్‌ గాయాలయ్యాని సమాచారం. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తన నివాసంలో 9.30 గంటలకు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. డీజీపీ, హోం మంత్రి సహా సీనియర్ పోలీసు అధికారులు, ప్రధాన కార్యదర్శి తదితరులు సమావేశానికి హాజరయ్యారు.

ఇది చదవండి: Delhi: ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. 27 మంది సజీవ దహనం!

image 0 compressed 57ఈ ఘటనపై సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. నిందితులను పట్టుకుని కఠిన శిక్ష పడేలా చూస్తామని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. కాగా, టనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా, నిందితులను విడిచిపెట్టబోమని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ‘గుణా సమీపంలో వేటగాళ్లు జరిపిన కాల్పుల్లో ముగ్గురు పోలీసు అధికారులు వీరమరణం పొందారని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని’ హోంమంత్రి సానుభూతి తెలిపారు.

  • మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.