పశ్చిమ బెంగాల్ ఉపాధ్యాయ నియామక కుంభకోణానికి సంబంధించి మంత్రి పార్థా ఛటర్జీతో పాటు మరో ముగ్గురిని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో వ్యక్తిగత కార్యదర్శి సుకాంతా ఆచార్యతో పాటు మంత్రికి బాగా సన్నిహితురాలిగా చెబుతున్న అర్పితా ముఖర్జీ కూడా ఒకరు. అక్కడి వారికి ఆమె ఎవరు? మంత్రికి ఎంత క్లోజ్ అన్నది తెలుసు. కానీ దక్షిణాది వారు మాత్రం అసలు ఎవరీ అర్పితా ముఖర్జీ అని వెతుకులాట ప్రారంభించారు. అర్పితా ముఖర్జీ.. కాలేజ్ రోజుల్లో మోడల్ గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2008 నుంచి 2014 వరకు సినిమాల్లో యాక్టివ్ గా ఉన్నారు. ఆవిడ ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు. ఆమె తండ్రి మరణం తర్వాత ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నారు. అయితే ఆమె వైవాహిక జీవితం గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. కొన్నాళ్లకు ఆవిడ తిరిగి కోల్‌కతా వచ్చేశారు. This lady is Arpita Mukherjee, ED has recovered ₹20 crore cash from her house. She is close aid of TMC minister Partha Chatterjee. pic.twitter.com/t8bJQ4zEak — Facts (@BefittingFacts) July 22, 2022 ఆమె 2008లో ‘పార్టనర్’.. 2009లో బెంగాలీ సూపర్ స్టార్ ప్రొసెంజిత్ ఛటర్జీ సరసన ‘మామా భగ్నే’ అనే సినిమాల్లో నటించారు. అంతేకాకుండా బెంగాలీ, ఒరియా, తమిళ సినిమాల్లో అడపాదడపా సందడి చేశారు. 2019, 2020లో కోల్‌కతాలోనే పెద్దదైన దుర్గాపూజ కమిటీ(నక్తల ఉదయాన్ సంఘం)కి ప్రచారకర్తగా ఉన్నారు. ఆ కమిటీలో పార్థా ఛటర్జీ కీలకపాత్ర పోషింస్తుండేవారు. Rs. 20 crore cash recovered by @dir_ed from the residence of Arpita Mukherjee; close aide of WB Education Minister Partha Chatterjee in the SSC scam case. Sources claim that piles of cash were found inside WB Govt Education Ministry envelopes with National Emblem printed on them. pic.twitter.com/xLsWQeVzL2 — Suvendu Adhikari • শুভেন্দু অধিকারী (@SuvenduWB) July 22, 2022 అక్కడి నుంచే వారి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని.. పార్థా ఛటర్జీకి అర్పితా సన్నిహితురాలిగా మారారని చెబుతున్నారు. ఆమె అత్యంత ఆప్తురాలు కాబట్టే ఆవిడను నమ్మి అన్ని కోట్లు అక్కడ పెట్టారంటూ విమర్శిస్తున్నారు. అయితే ఆ నగదు మొత్తం పార్థా ఛటర్జీకి చెందిందేనని అర్పితా ఒప్పుకున్నట్లు చెబుతున్నారు. అర్పిత, పార్థా ఉమ్మడిగా ఆస్తి కూడా కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను సైతం ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Arpita Mukherjee, close aide of West Bengal cabinet minister Partha Chatterjee, brought to ESIC Medical College in Kolkata. pic.twitter.com/xwlSCuujjl — ANI (@ANI) July 25, 2022 ఇదీ చదవండి: ఈ బుడ్డోడు మహా ఘటికుడు! ఏకంగా సీఎం జగన్ జోబిలోంచి పెన్ను లాగేశాడు ఇదీ చదవండి: అధికారం ఇవ్వండి.. రూ.60 వేల కోట్లతో ఏపీని అభివృధ్ది చేస్తా: కేఏ పాల్