మనలో చాలా మందికి వ్యాపారం చేయాలని ఆలోచన ఉంటుంది. అయితే బిజినేస్ బాగ జరగడం కోసం కొందరు మంచి ఆలోచనలు చేస్తారు. మరికొందరు అతి తెలివి ప్రదర్శించి.. చిక్కుల్లో పడతారు. తాజాగా ఓ వ్యక్తి ఫేస్ బుక్ అనుకునేలా.. ఫేస్ బేక్ పేరుతో కన్ఫెక్షనరీ షాప్ తెరిచేశాడు. అందరికీ తెలిసిన ఫేస్ బుక్ పేరుతో షాప్ పెట్టేస్తే వ్యాపారం జోరుగా ఉంటుందని భావించి ఉంటాడు. కానీ, ఫేస్ బుక్ సంస్థ మెటా ఊరుకుంటుందా? కోర్టుకు తీసుకెళ్లి లెంపకాయలు వేయించింది. వివరాల్లోకి వెళ్తే... కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో చెందిన వ్యాపారి నౌఫెల్ మలోల్. ఆయన ఫేస్ బేక్ పేరుతో కన్ఫెక్షనరీ వ్యాపారం ప్రారంభించాడు. అయితే ఆ నేమ్ బోర్డులు అచ్చం ఫేస్ బుక్ ను పోలీ ఉంది. దీంతో ఫేస్ బుక్ సంస్ధ మెటా దాఖలు డిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. ఫేస్ బేక్ పేరుతో కానీ, ఫేస్ బుక్ ను పోలిన మరో పేరుతో వ్యాపారం చేయకుండా కోర్టు నిషేధం విధించింది. "ఫేస్ బుక్ అన్నది బాగా తెలిసిన ట్రేడ్ మార్క్. అనుచిత లబ్ధి పొందేందుకే ఫేస్ బేక్ యజమాని ఈ పేరును ఎంపిక చేసుకున్నాడు" అని న్యాయమూర్తి జస్టిస్ నవీన్ చావ్లా తీర్పు సందర్భంగా పేర్కొన్నారు. ఈకేసు పై న్యాయమూర్తి మధ్యంతర ఆదేశాలు జారీ చేశారు. దీంతో వ్యాపారి నౌఫెల్ మలోల్ తన షాపునకు ఫేస్ బేక్ ను ఫేస్ కేక్ గా పేరు మార్చాడు. అయితే ప్రతివాది దురుద్దేశ్యం దీనితో స్పష్టమైనట్టు పేర్కొన్నారు. ఫేస్ బుక్, ఫేస్ బేక్ మధ్య వ్యత్యాసం ఉన్నా, చూడ్డానికి ఒకే మాదిరిగా ఉన్నట్టు అభిప్రాయపడ్డారు. దీంతో వ్యాపారికి రూ.50,000 జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: వీడియో: బాలుడ్ని మింగేసిన మొసలి.. కట్టేసి కాపలా కాసిన గ్రామస్తులు.. ఎందుకంటే.. ఇదీ చదవండి: Prefab Homes: మీ సొంత స్థలంలో 20 లక్షలకే అదిరిపోయే డూప్లెక్స్ హౌస్!