సినిమాల్లోనే విలన్ కానీ నిజ జీవితంలో మాత్రం సోనూసూద్ పెద్ద హీరో అని అందరికీ తెలిసిందే. ఆ మధ్య లాక్ డౌన్ సమయంలో తమ సొంత ఊళ్ళకి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్న వారిని సోనూసూద్ ప్రత్యేక బస్ ఏర్పాటు చేసి వారిని సురక్షితంగా చేర్చడం, కరోనా సమయంలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఉద్యోగాలు వేయించడం, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి చేయూతనివ్వడం లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ నేషనల్ హీరో అయిపోయారు. ట్విట్టర్ లో “అన్నా నువ్వే దిక్కు మమ్మల్ని రక్షించు” అంటే వెంటనే "నేనున్నాను" అంటూ సమాధానమిస్తారు సోనూసూద్. ఉదయం సమస్య వస్తే.. సాయంత్రంలోగా ఆ సమస్యను పరిష్కరిస్తారు. సోనూసూద్ కి చెప్తే చాలు.. మన పనులు పూర్తవుతాయ్, మన కలలు నెరవేరుతాయ్ అనే నమ్మకం జనాల్లో ఏర్పడింది. ఈరోజు సోనూసూద్ కున్న నెట్వర్క్ అలాంటిది. దేశంలో ఏ మారుమూలన ఉన్న వ్యక్తి అయినా సహాయం కోసం సోనూసూద్ అంటే.. నిమిషాల్లో రెస్పాన్స్ ఉంటుంది. కష్టం వచ్చిన వెంటనే ప్రత్యక్షమవుతారు. నీ కష్టం నాది, ఇక మర్చిపో అని హామీ ఇస్తారు. ఎలాంటి కష్టాన్నైనా,ఎంత ఖర్చైనా తొలగించి వారి పాలిట హీరో అనిపించుకుంటారు. తాజాగా మరోసారి సోనూసూద్ తన హీరోయిజాన్ని చూపించారు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందిన మొహమ్మద్ సఫన్ ఆలీకి 7 నెలల చిన్న పాప ఉంది. ఆ చిన్నారి లివర్ సంబంధిత సమస్యతో బాధపడుతోంది. పాపకి లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలని, ఈ ట్రీట్ మెంట్ కి చాలా ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. తమ దగ్గర అంత స్థోమత లేకపోవడంతో సోనూసూద్ ను కలిసి తమ బాధను చెప్పుకున్నారు మొహమ్మద్ సఫన్ అలీ. దీనికి స్పందించిన సోనూసూద్.. వైద్యానికి అయ్యే ఖర్చు తానే భరిస్తానని హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం.. సొంత ఖర్చులతో అలీ కుటుంబాన్ని కేరళలోని ఆసుపత్రికి తరలించి పాపకి వైద్యం చేయించారు. కొచ్చిలోని “ఆస్టర్ మెడిసిటీ” హాస్పిటల్ లో చిన్నారికి ట్రీట్ మెంట్ పూర్తయ్యింది. ఆపరేషన్ సక్సెస్ కావడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న సోనూసూద్ హర్షం వ్యక్తం చేశారు. “నేను కాదు, ఆ తల్లి ప్రార్ధన తన బిడ్డను కాపాడింది” అంటూ సోనూసూద్ ఫోటోను షేర్ చేస్తూ ట్వీట్ చేశారు. “ఆమె ప్రార్ధించిన దేవుడు నీవే సోనూసూద్” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి సోనూసూద్ చూపిన మానవత్వంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. मेरा नहीं माँ की दुआ का असर है ❤️@SoodFoundation @AsterMedcity14 https://t.co/kfhW7eaS6N — sonu sood (@SonuSood) July 20, 2022 ఇది కూడా చదవండి: బిక్షాటన చేసే పిల్లలకు SI పాఠాలు.. సెల్యూట్ సార్! ఇది కూడా చదవండి: నాన్న.. గోదావరిలో దూకి చనిపోతున్నా! కన్నీరు పెట్టిస్తున్న యువకుడి ఆత్మహత్య!