స్త్రీ లేకపోతే సృష్టే లేదు. అసలు మహిళ లేకుండా మానవ మనుగడ అసాధ్యం. స్త్రీలను గౌరవించాలని మన పురాణాలు, వేదాలు చెబుతాయి. ఆడవారిని గౌరవించని సమాజం అభివృద్ధి చెందదు అంటారు. నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో మగవారితో పోటీ పడుతున్నారు. అంతరిక్షంలోకి వెళ్లి వస్తున్నారు. మగవారితో పోల్చుకుంటే తాము ఎందులో తక్కువ కాదని నిరూపించుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు మహిళలు లారీ, బస్సులు వంటి పెద్ద వాహనాలను సైతం ఎంతో సమర్ధవంతగా నడుపుతున్నారు. ఇటీవల ఇలాంటి వార్తలు అనేకం వచ్చాయి. అలానే ఓ యువతి పెద్ద వాహనాలను నడపాలని ఆసక్తితో ఒకవైపు లా చదువుతూనే మరొక వైపు బస్సు నడిపింది. మరి.. ఆ యువతి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. కేరళలోని ఎర్నాకులంకు చెందిన మేరీ అన్సలేన్ అనే 21 ఏళ్ల యువతి "లా" కోర్సు చదువుతోంది. మేరికి చిన్నప్పటి నుంచి పెద్ద వాహనాలను ఆసక్తిగా చూస్తుండేంది. ఈ క్రమంలో వాటిని నడపాలనే కోరిక సైతం పుట్టింది. అలా బస్సు నడపడం నేర్చుకుంది. అంతే కాక ఇప్పుడు లా చదువుతూనే మరొక వైపు బస్సును నడుపుతోంది మేరీ. ప్రతి ఆదివారం రద్దీగా ఉండే కక్కనాడ్ , పేరంబదప్పు మార్గంలో మేరి బస్సు నడిపేది. బస్సును నడిపినందుకు ఒక రూపాయికి తీసుకోదు. ఆమెను ఎంతో మంది అవమానించారు. ఆడపిల్ల బస్సులు నడపడం ఏంటని అరిచారు. అయిన మేరీ ఎవరి మాటల లెక్క చేయలేదు. చేసేది తప్పుపని కాన్నప్పుడు ఎవరికి భయపడే అవసంలేదని ఆమె బలంగా నమ్ముతుంది. మేరీ మాట్లాడుతూ.. "పెద్ద వాహనాలు నడపడం అంటే నాకు చాలా ఇష్టం. లారీ, ట్రక్కులు, బస్సులు వంటి నడపడం వచ్చు. దీంతో నేను ఉచితంగానే బస్సు నడుపుతూ సోసైటి సేవ చేయవచ్చు కదా అనే ఆలోచన వచ్చింది. దీంతో ప్రతి ఆదివారం బస్సును ఉచితగా నడుపుతుంది. మొదటి రోజు నేను బస్సు నడిపినప్పుడు అందరూ షాక్ గురయ్యారు. మరికొందరు భయపడ్డారు. చాలా మంది ఆడపిల్ల బస్సు నడపడం ఏమిటని నాపై కోప పడ్డారు. తను కచ్చితంగా యాక్సిడెంట్లు చేస్తుందన్నారు. ఇప్పుడు అదే జనాలు నేను బస్సు నడుపుతుంటే చూస్తూ ఉండిపోయారు" అని తెలిపింది. కొందరు డ్రైవర్లు మేరీ బస్సు నడిపేటప్పుడు ఓవర్ టేక్ చేసే ప్రయత్నాలు చేసేవారు. అంతే కాక మధ్యలో కామెంట్స్ సైతం చేస్తుండేవారు. ఎవరు ఎన్ని అవరోధాలు సృష్టించిన తన కుటుంబ సభ్యుల సహకారంతోనే బస్సు డ్రైవింగ్ నేర్చుకున్నాని, ముఖ్యం అమ్మమ్మ మరియమ్మ.. తన చిన్నతనం నుంచి డ్రైవింగ్ గురించి ప్రోత్సహించిందని మేరి తెలిపింది. మరి... ఈ యువతిపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: వీడియో: నేషనల్ హైవేపై అలవోకగా లారీ నడిపిన మహిళ.. ఆమె కాన్ఫిడెన్స్పై నెటిజనుల ప్రశంసలు! ఇదీ చదవండి: సముద్రంలో తిరగబడ్డ పడవ.. కాస్తలో పెను ప్రమాదం!