కేజీఎఫ్-2 సినిమా రీ షూట్, 14 ఏప్రిల్ 2022 న విడుదల అనుమానమేనా

ఫిల్మ్ డెస్క్- కేజీఎఫ్.. ఈ సినిమా ఎంత బ్లాక్ బాస్టర్ హిట్టో అందరికి తెలుసు. కన్నడంలో వచ్చిన కేజీఎఫ్.. ఒక్కసారిగా పాన్ ఇండియా సినిమాగా మారింది. కేవలం కన్నడ సినిమా రంగాన్నే కాకుండా మొత్తం ఇండియా సినిమా రంగాన్ని ఊపేసింది కేజీఎఫ్. కన్నడ హీరో యష్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను వీపరీతంగా అకట్టుకుంది.

కేజీఎఫ్ సినిమాను రెండు బాగాలుగా తీశారు. ఇందులో భాగంగా విడుదలైన కేజీఎఫ్ రిలీజ్ అయి ప్రభంజనం సృష్టించింది. ఈ సినిమాతో యష్ పాన్ ఇండియా హీరో అయిపోయాడు. కన్నడ సినీ పరిశ్రమకు కేజీఎప్ మూవీ బాగా ప్లస్ అయింది. ఇక ప్రస్తుతం కేజీఎఫ్ 2 సినిమా షూటింగ్ పూర్తైంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తికావచ్చాయని చిత్ర బృందం తెలిపింది. కరోనా వల్ల కేజీఎఫ్ 2 విడుదల ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది.

KGF 2 1

పలుమార్లు విడుదల తేదీని మారుస్తూ వచ్చిన ఈ సినిమా 2022 ఏప్రిల్ 14న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఐతే ఇటువంటి సమయంలో కేజీఎఎఫ్-2 సినిమాకు సంబందించిన ఓ తాజా న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలోని ఒక ఫైట్ ని మళ్ళీ రీషూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతకు ముందు తీసిన ఫైట్ సీన్ ఇంకా బెటర్ గా తీసి ఉండాల్సింది అనే అభిప్రాయం వచ్చిందట. ఈ సినిమాలో ఫైట్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి బెటర్మెంట్ కోసం మళ్ళీ తీద్దామని హీరో యష్ తో పాటు, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ భావించారట.

ఇంకేముంది అనుకున్నదే తడవుగా ఓ ఫైట్ సీన్ ను మళ్లీ రీ షూట్ చేస్తున్నారు. ఈ సినిమా టెక్నీషియన్స్ కొంతమంది షూటింగ్ స్టిల్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రశాంత్ నీల్ ప్రభాస్ సలార్ సినిమాతో బిజీగా ఉన్నా, మధ్యలో కేజీఎఫ్-2 సినిమా రీషూట్ కి వెళ్లారని సమాచారం. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడుతూ వస్తున్న కేజిఫ్-2 రీషూట్ తో మళ్ళీ వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.