మాతో క్రికెట్ ఆడనట్టే.. ఇండియాతో కూడా ఆడకుండా ఉండగలరా?: ఇమ్రాన్ ఖాన్

Pakistan President Sensational Comments on INDIA Team - Suman TV

ఆ మధ్య పాకిస్తాన్‌తో సిరీస్‌ ఆడేందుకు ఆ దేశానికి వచ్చిన న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు, మ్యాచ్‌ ప్రారంభానికి కొన్ని గంటల ముందు సిరీస్‌ రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించి పాక్‌ను షాక్‌ గురిచేసింది. భద్రతా కారణాల దృష్ట్య ఇక్కడ క్రికెట్‌ ఆడలేమని చెప్పి వెళ్లిపోయింది. దీన్ని ఘోర అవమానంగా ఫీల్‌ అయిన పాక్‌ మాజీ క్రికెటర్లు న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డుపై దుమ్మేత్తిపోశారు. అనంతరం పాక్‌తో తమ సిరీస్‌ కూడా రద్దుచేస్తున్నట్లు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు కూడా ప్రకటించడంతో పుండు మీద కారం చల్లినట్లు అయింది. న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్దులపై తీవ్రంగా మండిపడ్డారు పాక్‌ మాజీ ఆటగాళ్లు. టీ20 వరల్డ్‌ కప్‌లో ప్రతీకారం తీర్చుకుంటాం అనే స్థాయికి వెళ్లింది వారి కోపం.

Pakistan President Sensational Comments on INDIA Team - Suman TVకాగా ఇప్పుడు అదే విషయంపై పాకిస్తాన్‌ ప్రధాని, మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ కూడా స్పందించారు. క్రికెట్‌లో డబ్బే ప్రధానమైందని అన్నారు. న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌ తనతో సిరీస్‌ రద్దు చేసుకున్నట్లు భారత్‌తో అలా చేయగలరా అని ప్రశ్నించాడు. ఇండియా స్టోర్ట్స్‌ను కంట్రోల్‌ చేస్తుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ పాక్‌లో క్రికెట్‌ ఆడేందుకు నిరాకరిస్తే ఇమ్రాన్‌ఖాన్‌ ఇండియాను విమర్శించడంపై సోషల్‌ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. మరీ పాక్‌ ప్రధాని వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: పాకిస్తాన్‌ను కడిగేసిన పాతికేళ్ల అమ్మాయి.. ఎవరీ స్నేహా?