పాకిస్తాన్‌ను కడిగేసిన పాతికేళ్ల అమ్మాయి.. ఎవరీ స్నేహా?

ప్రపంచ వేదికలపై మన గొంతు వినిపించడమే కాదు మన దేశంపై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టిన ఓ పాతికేళ్ల అమ్మాయి. యూఎన్‌ఓలో భారత్‌ నుంచి మొదటి కార్యదర్శిగా ఉన్న స్నేహా దూబే నే ఆ సంచలనం. పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఐక్య రాజ్య సమితి 76వ జనరల్‌ అంసెంబ్లీ (యూఎన్‌జీఏ) సమావేశంలో భారత్‌పై మళ్లీ తన అక్కసును వెళ్లగక్కారు. ఈ క్రమంలో పాకిస్తాన్‌ ప్రధాని సమావేశంలో కశ్మీర్‌ సమస్యను లేవనెత్తి భారత్‌పై ద్వేషపూరిత ఆరోపణలు చేసి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారు. దీంతో భారత ప్రతినిధి స్నేహ దూబే పాక్‌ ప్రధాని వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఆమె మాట్లాడుతూ….” జమ్మూ కాశ్మీర్‌, లడఖ్‌ వంటి కేంద్రపాలిత ప్రాంతాలు భారత్‌లో అంతర్భాగమని, వాటిని ఎన్నటికీ భారత్‌ నుంచి విడదీయలేరు. పాకిస్తాన్‌ చట్ట విరుద్ధంగా ఆక్రమించి స్థావరాలు ఏర్పాటు చేసుకున్న భారతదేశానికి చెందిన ప్రాంతాలను తక్షణమే ఖాళీ చేయండి.” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక పాక్ ప్రధాని కుదిరినప్పుడుల్లా పొరుగు దేశమైన భారత్‌పై కయ్యానికి కాలుదువ్వడమే పనిగా పెట్టుకుంటారంటూ ఎద్దేవా చేశారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చి, స్వేచ్ఛగా తిరిగేలా పాస్‌పోర్ట్‌లు కూడా మంజూరు చేసిన గొప్ప దేశం అంటూ విమర్శించారు. ఉగ్రవాదులకు శిక్షణనిచ్చి ఆర్థిక సహయం అందిస్తున్న చారిత్రాత్మక దేశంగా ప్రపంచ దేశాలకు తెలుపంటూ వ్యంగ్యాస్త్రాలు కురిపించారు. పాకిస్తాన్‌ తమను తాము ఉగ్రవాద బాధిత దేశంగా చెప్పుకుంటుందని, నిప్పు పెట్టి తిరిగి అవే మంటల్ని ఆర్పే వ్యక్తిలా నటిస్తోందని విమర్శించారు.

The undergrowth girl who washed Pakistan - Suman TVఇలా పాకిస్తాన్‌కు ధీటుగా బదులిచ్చిన స్నేహ దూబే గురించి ఇప్పుడు నెట్టింట్లో చర్చ మొదలైంది. అసలు ఇంతకీ ఎవరామే అంటూ నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు. స్నేహ దూబే ప్రస్తుతం ఐరాసలో భారతదేశ మొదటి కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమె తండ్రి వ్యాపార వేత్త, తల్లి పాఠశాల ఉపాధ్యాయురాలు. చిన్న వయసు నుంచే స్నేహ దూబే దేశానికి ప్రాతినిధ్యం వహించాలని నిర్ణయించుకున్నారు. గోవాలో పాఠశాల చదువును పూర్తి చేశారు, పూణెలో కళాశాల విద్య, ఆతర్వాత దిల్లీ జేఎన్‌యూ నుంచి ఎంఫిల్‌ పట్టా పొందారు. 2012 బ్యాచ్‌కు చెందిన దూబే మొదటి పోస్టు విదేశాంగ శాఖలో తరువాత 2014లో స్పెయిన్‌లోని భారత దౌత్య కార్యాలయానికి బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఐరాసలో భారతదేశ మొదటి కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.