పూర్వ కాలంలో మనిషి ఆయుష్షు కనీసం వంద సంవత్సరాలు వరకు ఉండేదట. కానీ కాలం మారింది ఇప్పుడు మనిషి ఆయుష్షు ఎనభై సంవత్సరాలు అంటే మహా ఎక్కువ. కాలుష్యం, మనం తింటున్న కలుషితమైన ఆహార పదార్థాలు ఇలా ఎన్నో కారణాల వల్ల మనిషి ఆయుష్షు తగ్గిపోతుంది. కానీ నైరుతి జపాన్‌లోని ఫుకోకా పట్టణానికి చెందిన కానే టనాకా అనే మహిళ 119 సంవత్సరాల వరకు బతికింది. నైరుతి జపాన్‌లోని ఫుకుయోక అనే ప్రాంతంలో కానే టనాకా 1903, జనవరి 2 వ తేదీన పుట్టింది. ఆ సంవత్సరంలోనే రైట్ సోదరులు వారి తయారు చేసి సొంత విమానంలో ప్రయాణించారు.
కానే టనాకా ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయసున్న వ్యక్తిగా గిన్నిస్ పుస్తకంలో చోటు సంపాదించింది. ఈ నెల 19న కానే టనాకా కన్నుమూసినట్లు జపాన్ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ప్రస్తుతం టనాకా వయసు 119 సంవత్సరాలు అంటున్నారు కుటుంబ సభ్యులు. అంతేకాదు కానే టనాకా కి 2019లో ప్రపంచంలోనే ఎక్కువ సంవత్సరాలు బతికి ఉన్న వృద్ద మహిళగా గిన్నిస్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు.
భర్త, పెద్ద కుమారుడు వెళ్లిన సమయంలో.. కానే నూడుల్స్ షాప్ మెయింటేన్ చేసేది. దాంతో పాటు గా ఆమె చాక్లెట్ ఇతర శీతల పానియాలు అమ్మేది. తాను చాక్లెట్ సహా రుచికరమైన ఆహారం తీసుకోవడం వల్ల తాను ఇంత ఆరోగ్యంగా ఉన్నానని కానే చెప్పేవారు. కానే టనాకా రెండుసార్లు క్యాన్సర్ నుండి బయటపడింది.