ఒకప్పుడు సర్వర్.. ఇప్పుడు ముకేశ్ అంబానీనే దాటేశాడు

Chang Ping Zaho Life Story

సంపద ఎవరి సొత్తు కాదు.. కాస్తంత కష్టం.. కొంచెం తెలివితేటలు ఉంటే చాలు.. ఎవరైనా ధనవంతుడు కావొచ్చు. ఈ మాటలకు నిలులెవత్తు నిదర్శనంగా నిలుస్తారు చైనా సంతతి కెనడా వ్యక్తి చాంగ్‌ పెగ్‌ జావో. ఒకప్పుడు మెక్‌ డొనాల్డ్స్‌ లో సర్వర్‌ గా పని చేశాడు. ఇప్పుడు.. ప్రంపచ కుబేరుల జాబితాలో చేరాడు. ఏకంగా ఆసియా కుబేరుడు ముకేశ్‌ అంబానీని వెనక్కి నెట్టి.. టాప్‌ 10 ప్రపంచ కుబేరుడిగా నిలిచాడు జావో. ప్రస్తుతం ముకేశ్‌ అంబానీ 93 బిలియన్‌ డాలర్ల సంపదతో 11వ స్థానంలో ఉండగా.. జావో.. 96 బిలియన్ల సంపదతో.. 10వ స్థానంలో నిలిచినట్లు.. బ్లూమ్‌ బర్గ్‌ ఇండెక్స్‌ తెలిపింది. క్రిప్టో కరెన్సీ వల్ల.. జావో సంపద భారీగా పెరిగినట్లు బ్లూమ్‌ బర్గ్‌ వెల్లడించింది.

ఇది కూడా చదవండి : లండన్ లో స్థిరపడనున్నారన్న ప్రచారాన్ని ఖండించిన ముకేశ్ అంబానీ

Chang Ping Zaho Life Story

ప్రపంచంలోనే అతి పెద్ద క్రిప్టో ఎక్స్ఛేంజీల్లో ఒకటైన బినాన్స్‌ సంస్థ అధిపతి జావో. అంతేకాక ప్రపంచలోనే అత్యంత సంపన్నుడైన క్రిప్టో బిలియనీర్‌ కూడా జావోనే. బినాన్స్‌ లో జావో వాటా ఆధారంగా బ్లూమ్‌ బర్గ్‌ ఆయన సంపదను లెక్కించింది. 2021లో బినాన్స్‌ 20 బిలియన్‌ డాలర్ల సంపదను నమోదు చేసింది. దానిలో జావో 90 శాతం వాటా కలిగి ఉన్నాడు. అయితే బ్లూమ్‌ బర్గ్‌ కేవలం ఈ వాటాను మాత్రమే లెక్కించిందని.. జావో దగ్గర ఉన్న బిట్‌ కాయిన్‌ నిల్వలు, బినాన్స్‌ జారీ చేసే దాని కాయిన్స్‌ లో వాటాలను లెక్కించలేదని తెలిపింది. వీటిని కూడా లెక్కిస్తే.. జావో 4,5 స్థానాల్లో ఉన్న బిల్‌ గేట్స్‌, జుకర్‌ బర్గ్‌ ల సరసన నిలుస్తాడని బ్లూమ్‌ బర్గ్‌ తెలిపింది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి : చీరల వ్యాపారంలోకి అంబానీ.. ఇక తక్కువ ధరకే రిలయన్స్ చీరలు