చీరల వ్యాపారంలోకి అంబానీ.. ఇక తక్కువ ధరకే రిలయన్స్ చీరలు

Low Cost Relaince Sarees - Suman TV

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ వ్యాపార సామ్రాజ్యం గురించి ప్రత్యకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశంలోనే నెంబర్‌ 1 కుబేరుడు. చాలా రంగాల్లో ఆయన వ్యాపారాలు విస్తరించారు. ఇప్పుడు ఆయన కన్ను చీరలు, సాంప్రదాయ భారతీయ దుస్తుల వ్యాపారంపై పడింది. రిలయన్స్‌ రిటైల్‌ ఆధ్వర్యంలో ‘అవంత్ర’ బ్రాండ్‌ నేమ్‌తో చీరలు, సాంప్రదాయ దుస్తులను విక్రయించనున్నారు. వీటి కోసం ప్రత్యేకంగా స్టోర్లను తెరవనున్నట్లు సమాచారం.Relaince Sarees - Suman TVత్వరాలో టాటా తనిష్క్‌ జ్యూయలరీ స్టోర్లను విస్తరించి సాంప్రదాయ దుస్తుల అమ్మకాల వ్యాపారంలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో  ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ రిటైల్‌, టాటా తనిష్క్‌ స్టోర్లకు పోటీగా అవంత్ర స్టోర్లను అంబానీ ప్రారంభించనున్నట్టు వ్యాపార వర్గాలు చర్చించుకుంటున్నాయి. కాగా ఈ స్టోర్లను మొదట బెంగుళూరులో తెరిచి, అనంతరం కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నట్లు సమాచారం. అవంత్రలో రిలయన్స్‌ సొంత బ్రాండ్‌ దుస్తులతో పాటు నల్లీ సిల్క్స్‌, పోతీస్‌ వంటి ప్రముఖ బ్రాండ్లు లభించనున్నాయి. ఈ మేరకు వాటితో ఒప్పందం కుదిరినట్టు తెలుస్తుంది.