స్కూల్‌ పిల్లాడిలా ఆడుతున్నాడు.. రైనాపై స్టెయిన్‌ సంచలన కామెంట్స్‌

suresh raina

టీమిండియా మాజీ క్రికెటర్‌, టీ20 స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మెన్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్లేయర్‌ సురేష్‌ రైనా స్కూల్‌ పిల్లాడిలా ఆడుతున్నాడంటూ సౌతాఫ్రికా మాజీ పేసర్‌ స్పీడ్‌ గన్‌ డెయిల్‌ స్టెయిన్‌ విమర్శించాడు. క్విక్కర్‌ డెలవరీలను రైనా ఆడలేకపోతున్నాడని, ఇక అంతర్జాతీయ క్రికెటర్‌ ఇలా ఆడడాన్ని తాను నమ్మలేకపోతున్నాను అంటూ సోషల్‌ మీడియాలో పేర్కొన్నాడు. 19న ముంబై ఇండియన్స్‌తో జరగిన మ్యాచ్‌లో రైనా కేవలం 4 పరుగులే చేసి విఫలమయ్యాడు. గతంలో సీఎస్‌కే కు ప్రధాన బలంగా ఉన్న రైనా ఈ మధ్య సరిగా ఆడడంలేదు. దీనిపై గతంలో చాలా విమర్శలే వచ్చాయి. అయినా రైనా ఒక మ్యాచ్‌ విన్నర్‌ అన్న సంగతి మర్చిపోవద్దు. అతని రోజుంటూ వస్తే కొండంత లక్ష్యాన్ని సైతం ఊదేస్తాడు. స్టెయిన్‌ చేసిన ఆరోపణలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.