భార్య తెరచాటు సంసారాన్ని నిలదీసిన భర్త.. చివరికి..!

భార్యాభర్తల వైవాహిక జీవితంలో వివాహేతర సంబంధాలు వచ్చి చేరి పచ్చటి కాపురాలను నిట్టనిలవునా చీల్చేస్తున్నాయి. ఇక ఇంతటితో ఆగక కొందరు భార్యలు ప్రియుడిపై మోజు పడి చివరికి అడ్డొచ్చిన భర్తను కూడా కాదనుకుంటూ కడతేరుస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనలోనే ఓ భార్య ప్రియుడి సాయంతో భర్తను హత్య చేసి రోడ్డుప్రమాదంగా చిత్రీకరిచేందుకు ప్రయత్నిస్తూ పోలీసులకు దొరికిపోయింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ ప్రాంతం. మొద్దు వెంకటేష్, మాధవి ఇద్దరు భార్యాభర్తలు. వీరికి పదేళ్ల కిందటే వివాహం జరిగింది. ఓ కూతురుతో పాటు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.

ఇక వీరి కాపురం కొంత కాలం సంతోషంగానే సాగింది. అయితే రోజులు మారుతున్న కొద్ది భార్య బుద్ది వక్రమార్గంలోకి వెళ్లి పరాయి మగాడిపై మనసుపడింది. నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన రమేష్ అనే వ్యక్తితో భార్య మాధవి తెరచాటు సంసారాన్ని నడిపిస్తూ ఉంది. దీంతో కొంత కాలం వీరి చికటి సంసారం భర్తకు తెలియకుండా ఘనంగా సాగుతూ వచ్చింది. అయితే ఇటీవల భార్య ప్రవర్తను గమనించిన భర్త వెంకటేష్ ఇదేం పని అంటూ గట్టిగా నిలదీశాడు. దీంతో తట్టుకోలేకపోయిన భార్య ఎలాగైన భర్తను చంపాలనే పథకాన్ని రచించింది. అనుకున్నట్లే భర్తను అంతమొందించేందుకు ప్రియుడు రమేష్ సాయాన్ని కూడా తీసుకుంది.

ఇది కూడా చదవండి: ముసలాయనతో మహిళ రెండో పెళ్లి. ఫస్ట్ నైట్ రోజే దిమ్మతిరిగే షాకిచ్చిన తాత!Wifeగత ఆదివారం రాత్రి రోజులాగే భర్త తినిపడుకున్నాడు. ప్లాన్ ప్రకారం ప్రియుడు మెల్లగా ఇంట్లోకి రావడంతో ఇద్దరు కలిసి వెంకటేష్ ను గొంతు నులిమి హత్య చేశారు. ఇక అనంతరం భర్త శవాన్ని ఏం చేయాలో తెలియక స్థానిక రోడ్డుపై పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేసి వెంకటేష్ శవాన్ని బైక్ మీద తీసుకెళ్లి రోడ్డెక్కారు. దీంతో అటు నుంచి పెట్రోలింగ్ పోలీసులు అడ్డురావడంతో వెంకటేష్ శవాన్ని అక్కడే వదిలేసి ఇద్దరు పరుగులు తీశారు. దీంతో అనుమానమొచ్చిన పోలీసులు ఎట్టకేలకు వారిద్దరిని పట్టుకుని నిలదీయగా మేము హత్య చేశామంటూ ఒప్పుకున్నారు. ఇక నిందితులిద్దరిని స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ప్రియుడిపై మోజు పడి చివరికి భర్తను కడతేర్చిన భార్య తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.