సమాజంలో అనేక రకాల మనుషులు ఉంటారు. డబ్బుపైన ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. దీని కోసం కొందరు రేయిబవళ్లు కష్టపడుతుంటారు. మరికొందరు మాత్రం అడ్డదారుల్లో డబ్బులు సంపాందిచాలని భావిస్తారు. ఈక్రమంలో దొంగతనాలకు పాల్పతుంటారు. ఈ మధ్యకాలంలో కొందరు యూట్యూబ్ లో చూసి మరీ దొంగతనాలకు స్కెచ్ వేసి.. అందినకాడికి దొచుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి యూట్యూబ్ లో చూసి బంగారు దుకాణంలో చోరీకి పాల్పడ్డాడు. అక్కడ అర కేజీకిపైగా బంగారం ఆభరణాలు దోచేసి.. చివరకు పోలీసులకు చిక్కాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం చెందిన షేక్ హుస్సేన్ బాషా సెల్ ఫోన్ రిపేర్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో ఆన్ లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడ్డాడు. సెల్ ఫోన్ రిపేరింగ్ వచ్చే వారిని ఏమార్చి వారి వద్ద ఉన్న సొమ్మును కాజేసేవాడు. ఈ బెట్టింగ్ కారణంగా రూ.10 లక్షల వరకు అప్పుడు చేశాడు. అవి తీర్చే మార్గం కనిపించలేదు. సులువుగా డబ్బులు సంపాందించేందు పథకం వేశాడు. దానికి దొంగతనాన్ని మార్గంగా ఎంచుకున్నాడు. ఈ క్రమంలో విజయవాడలోని గవర్నపేటలోని ఎక్కువగా బంగార దుకాణాలు ఉండటం గమనించాడు. దీంతో ఆ షాపుల్లోని బంగారం ఎలా దొంగతనం చేయాల్లో యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నాడు. జూలై 14న విజయవాడ వచ్చి.. మహేంద్ర అనే దుకాణంలోకి వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే రెక్కీ చేశాడు.
ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు లేవు గుర్తించాడు. అనుకున్నట్లుగానే మరుసటి రోజు అంటే.. జూలై15 సినీ పక్కీలో అక్కడి వచ్చి పవర్ కటర్ తో తాళాలు కట్ చేసి దుకాణంలోని 650 గ్రాముల బంగారం చోరీ చేశాడు. దుకాణ యాజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బృందాలుగా విడిపోయి గాలించారు. సెల్ ఫోన్ టవర్ ఆధారంగా అతడిని గుర్తించారు. దొంగతనం చేసిన బంగారం తాకట్టు పెట్టేందుకు వెళ్లిన సమయంలో పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా అరెస్టు చేశారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.