మైనర్ బాలికపై లైంగిక దాడి.. రాజస్థాన్ లో నిర్భయ తరహా ఘటన

పదహారేండ్ల మైనర్ బాలికపై నిర్భయ తరహా ఘటనను గుర్తుకుతెచ్చేలా మృగాళ్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితులు ఆమె ప్రైవేట్ భాగాల్లోకి పదునైన వస్తువులు చొప్పించారు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అల్వార్ లోని తిజారా ఫ్లైఓవర్ కింద రక్తపు మడుగులో పడివున్న బాలికను గుర్తించిన పోలీసులు ఆమెను జైపూర్ లోని జెకే లాన్ ఆస్పత్రికి తరలించారు. బాలిక పరిస్థితి ప్రస్తుతానికి నిలకడగానే ఉన్నప్పటికీ, దాదాపు రెండున్నర గంటల పాటు ఆపరేషన్ నిర్వహించిన వైద్యులు ఆమె ప్రైవేట్ భాగాల్లోని పదునైన వస్తువులను తొలగించారు.

ఇది కూడా చదవండి : కృష్ణా జిల్లాలో దారుణం.. చిన్నారిపై వృద్దుడి అత్యాచారయత్నం…!

ప్రస్తుతానికి ఆమెకు ప్రాణాపాయం తప్పిందని తెలిపిన వైద్యులు, అంతర్గత అవయవాలు బాగా దెబ్బతినడంతో ప్రస్తుతం బాలికను ఐసీయూలో ఉంచి చికిత్సను అందిస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన రాజస్థాన్ మంత్రి లాల్ మీనా దర్యాప్తు నిర్వహించేందుకు ప్రత్యేక బృందాన్ని (సిట్) ఏర్పాటుచేసినట్లు  తెలిపారు. దోషులను త్వరలోనే పట్టుకొని కఠినంగా శిక్షిస్తామంటూ రాజస్థాన్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మమతా భూపేష్ హామీ ఇచ్చారు. బాలిక కుటుంబానికి 6 లక్షల’పరిహారం ప్రకటించారు.