కృష్ణా జిల్లాలో దారుణం.. చిన్నారిపై వృద్దుడి అత్యాచారయత్నం…!

దేశంలో ఎక్కడ చూసినా కామాంధులు రెచ్చిపోతున్నారు. చిన్న వయసు నుంచి పండుముసలి వరకు ఆడది అని తెలిస్తే చాలు ఎవ్వరినీ వదలడం లేదు కృర మృగాలు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా రక్షణకు ఎన్ని చట్టాలు, పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించినా అఘాయిత్యాలు మాత్రం ఆగడంలేదు. దారుణమైన విషయం ఏంటంటే నెలల వయసు ఉన్న చిన్నారులపై కూడా కామవాంఛ తీర్చుకుంటున్నారు. అత్యాచారాలు మాత్రమే కాదు.. హత్యలకు పాల్పపడుతున్నారు.

ఇది చదవండి : ఆర్టీసీ బస్సులో అరుదైన నక్షత్ర తాబేళ్ల అక్రమ రవాణ!

తాజాగా ఆంధ్ర ప్రదేశ్. కృష్ణా జిల్లాలో దారుణం వెలుగుచూసింది. మనవరాలి వయసుండే ఓ చిన్నారిపై వృద్దుడు అత్యాచారయత్నానికి పాల్పపడ్డాడు. వివరాల్లోకి వెళితే… మచిలీపట్నం మండలం పల్లెపాలెం గ్రామానికి చెందిన ఏడేళ్ల చిన్నారిపై వీరస్వామి అనే వృద్దుడు కన్నేసాడు. తాత వయసు ఉన్న వీరాస్వామి ఆ చిన్నారికి చాక్లెట్లు ఇస్తానని మాయ మాటలు చెప్పి ఇంట్లోకి తీసుకు వెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అయితే వీరస్వామి వికృత చేష్టలతో భయపడిపోయిన చిన్నారి కేకలు వేసింది.

ఇది చదవండి : ఐపీఎల్‌ 2022 మెగా వేలానికి తేదీలు ఖరారు! ఎప్పుడంటే..?

ఆ చిన్నారి కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడకు చేరుకున్నారు.. వృద్దుడు చిన్నారితో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ కనిపించాడు. కొపోద్రిక్తులైన స్థానికులు వృద్దుడిని పట్టుకుని దేహశుద్ది చేసారు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వ‌ృద్దుడిని అదుపులోకి తీసుకున్నారు.