కోర్టులో షారుఖ్ కు నిరాశ, ఆర్యన్ ఖాన్ కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

ముంబయి- ఆర్యన్ ఖాన్.. ఇప్పుడు బాలీవుడ్ లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్ కేసులో అరెస్ట్ అయినప్పటి నుంచి అందరి దృష్టి ఈ అంశంపైనే పడింది. ముంబైలో క్రూయిజ్ లో రేవ్ పార్టీలో డ్రగ్ చేవిస్తుండగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు దాడులు నిర్వహించారు. షారుఖ్ కొడుకు ఆర్యన్ తో పాటు మరో ఏడు మందిని అరెస్ట్ చేశారు.

ఇదిగో అప్పటి నుంచి ఆర్యాన్ ఖాన్ బెయిల్ కోసం షారుఖ్ ఖాన్ శతవిధాల ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయన ప్రయత్నాలు ఏ మాత్రం ఫలించలేదు. తాజాగా షారుఖ్ ఖాన్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఆర్యాన్ ఖాన్‌ను ఇంకా కస్టడీలోనే ఉంచాలని, రిమాండ్‌ను పొడిగించమని కోర్టును ఎన్సీబీ కోరింది. దీంతో కోర్టు ఆర్యన్ ఖాన్ సహా 8 మంది నిందితులను మొత్తం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని విధించింది.

Aryan Khan 1

కోర్టులో ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటీషన్ సందర్బంగా ఇరువైపుల వాదోపవాదాలు జరిగాయి. తనకు ఆ క్రూయిజ్ పార్టీ నిర్వాహకులకు ఎలాంటి సంబంధం లేదని, తన స్నేహితుడు ఆహ్వానిస్తేనే వెళ్లానని ఆర్యన్ చెప్పాడు. అంతే కాదు ఆర్భాజ్‌తో తనకు ఫ్రెండ్ షిప్ ఉందని, కానీ అతడు చేసే పనులతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చాడు. తనకు బెయిల్ మంజూరు చేసినా విచారణకు పూర్తి సహకారం అందిస్తానని ఆర్యన్ తెలిపాడు.

ఐతే కోర్టు మాత్రం ఆర్యన్ ఖాన్ కు బెయిల్ మంజూరు చేయలేదు. ఆర్యన్ ఖాన్ సహా మొత్తం 8 మంది నిందితులను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని విధించింది. దీంతో షారుఖ్ ఖాన్ కు తీవ్ర నిరాశ ఎదురైంది. ఆర్యన్ బెయిల్ కోసం పై కోర్టుకు వెళ్లే యోచనలో షారుఖ్ ఉన్నారని తెలుస్తోంది. మరోవైపు ఆర్యాన్‌కు మద్దతుగా హృతిక్ రోషన్ చేసిన పోస్ట్ వివాదంతో పాటు, విమర్శలకు దారితీస్తోంది.