సరికొత్త రికార్డును క్రియేట్ చేసిన పవన్ ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్

Bhimla Nayak title song that created a new record -Suman Tv

ఫిల్మ్ డెస్క్- ‘భీమ్లా నాయక్’.. ఇప్పుడు తెలుగు సినమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తోంది. వకీల్ సాబ్ సినిమా తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా ‘భీమ్లా నాయక్’. పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్బంగా సెప్టెంబర్ 2న విడుదల చేసిన ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. పాత రికార్డులన్నింటిని తిరగరాస్తూ ముందుకు దూసుకుపోతోంది.

తెలుగు సినీ చరిత్రలో అత్యంత వేగంగా 1 మిలియన్ లైక్స్ సాధించిన పాటగా ‘భీమ్లా నాయక్’ రికార్డ్ నెలకొల్పినట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ విషయం తెలుపుతూ చిత్రయూనిట్ తాజాగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో ‘భీమ్లా నాయక్’ చిత్రాన్ని నిర్మిస్తోంది. సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, సంభాషణలు అందిస్తున్నారు.

Pawan 1

‘భీమ్లా నాయక్’ మూవీని సాగర్ కె చంద్ర దర్శకత్వంలో, నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ నిర్మిస్తున్నారు. ఇక ఇంతలా రికార్డ్ క్రియేట్ చేసిన ‘భీమ్లా నాయక్’ సినిమా టైటిల్ సాంగ్‌కి ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. జానపద కళాకారుడు మొగులయ్య, జోసెఫ్, థమన్, శ్రీకృష్ణ, పృథ్వీచంద్ర, రామ్ మిరియాల ఈ పాటను పాడారు. ఎస్. ఎస్. థమన్ ‘భీమ్లా నాయక్’ కు సంగీత దర్శకత్వం వహించారు.

ప్రస్తుతం ఈ పాట 1 మిలియన్ ప్లస్ లైక్స్‌లో పాటు 17 మిలియన్ ప్లస్ వ్యూస్‌ని సాధించి, మరిన్ని రికార్డులు నెలకొల్పేందుకు దూసుకుపోతోంది. పాటే ఇంతలా దుమ్ము రేపుతుంటే, ఈ పాటపై చిత్రీకరణ ఏవిధంగా ఉంటుందబ్బా అని పవన్ కళ్యాణ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతికి ‘భీమ్లా నాయక్’ ను విడుదల చేసేలా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.