ఓ బిచ్చగత్తె కారు వద్దకు వస్తే షారుక్ కొడుకు ఏంచేసాడంటే.. వైరల్ అవుతున్న వీడియో

ఫిల్మ్ డెస్క్- బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం బాలీవుడ్‌ ఫిల్మ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమవుతోంది. బిజినెస్ రాజధాని ముంబై నగర శివారు సముద్ర తీరంలోని గోవా వెళ్తున్న ఓ క్రూయిజ్‌లో జరిగిన రేవ్ పార్టీ జరిగింది. ఐతే ఈ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ తీసుకుంటున్నారన్న సమాచారం అందుకున్న నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు రంగంలోకి దిగి, క్రూయిజ్ లో జరుగుతున్న పార్టీపై దాడి చేశారు.

ఈ పార్టీలోని వారి నుంచి భారీ స్థాయిలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్‌ తో సహా మొత్తం 8 మందిని అధికారులు అరెస్ట్ చేశారు. ఇంకేముంది ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ వ్యవహారం సినీ పరిశ్రమలో మరోసారి కలకలం రేపుతోంది. ఈ అంశంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ చాలా రోజుల నుంచి డ్రగ్స్‌కు బానిసగా మారిపోయాడని, షారూక్ తన కొడుకు గురించి ఏ మాత్రం పట్టించుకోలేదని బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Aryan Khan 2

ఇక తన కొడుకును రక్షించుకునేందుకు దేశంలోనే పేరుమోసిన లార్ ద్వార ప్రయత్నాలు మొదలుపెట్టారు షారుక్ ఖాన్. ఐతే ఈ క్రమంలో ఆర్యన్‌ ఖాన్ కు సంబంధించిన ఓ పాత వీడియోను షారూక్ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సరిగ్గా మూడేళ్ల క్రితం 2018 సంవత్సరంలో బయటకు వచ్చిన ఈ వీడియోలో మలైకా అరోరా, ఇతర స్నేహితులతో కలిసి ముంబైలోని బస్తిన్ రెస్టారెంట్ నుంచి ఆర్యన్ బయటకు వస్తున్నాడు.

అతను కారు దగ్గరకు వెళ్తుండగా అడుక్కునే మహిళ ఓ చిన్నారిని ఎత్తుకుని ఆర్యన్ వద్దకు వచ్చింది. ఆమెను చూసిన ఆర్యన్జే వెంటనే తన జేబులోంచి కొంత డబ్బు తీసి ఇచ్చాడు. ఇంకేముంది ఆర్యన్ ఖాన్ ఎంతో మానవత్వం కలిగిన మనిషి అంటూ షారూక్ అభిమానులు ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడంతో ఆర్యన్ కు సంబందించిన ఈ పాత వీడియో సోషల్ మీడియాలై బాగానే వైరల్ అవుతోంది. నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)