వంగవీటి రాధాకు కరోనా.. ఆస్పత్రిలో చేరిక!

దేశ‌వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి ఉధృతి కొన‌సాగుతూనే ఉంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటం భ‌యాందోళ‌న‌ల‌కు గురిచేస్తున్నది. ముఖ్యంగా కరోనా ప్రభావం ఎక్కువగా సినీ, రాజకీయ ప్రముఖులపై చూపిస్తుంది. ఇప్పటికే పలువురు నేతలు కరోనా భారిన పడ్డారు. తాజాగా టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ కరోనా బారినపడ్డారు. స్వల్ప లక్షణాలతో టెస్టులు చేయించుకున్న ఆయనకు పాజిటివ్ ఉన్నట్టు వైద్యులు ధృవీకరించారు. దీంతో ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు.

ఇది చదవండి : మంత్రి కొడాలి నానికి కరోనా పాజిటీవ్!

image 1 compressed 57ఇటీవల తనను కలిసిన వారందరూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా వంగవీటి రాధ కోరారు. వంగవీటి రాధా ఆస్పత్రిలో చేరడంతో టీడీపీ శ్రేణులు, ఆయన అభిమానులు ఆందోళనలో ఉన్నారు. కాగా, వంగవీటి ఆరోగ్యం నిలకడగానే ఉందని సన్నిహితులు తెలిపారు. ఇటీవల తన హత్యకు రెక్కీ నిర్వహించారని వంగవీటి రాధా వెల్లడించి.. ఏపీ రాజకీయాల్లో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గన్‌మెన్ల సెక్యూరిటీ ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. అయితే, సెక్యూరిటీని వంగవీటి రాధా తిరస్కించి, వెనక్కి పంపించివేశారు.