మంత్రి కొడాలి నానికి కరోనా పాజిటీవ్!

దేశ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తుంది. గత నెల నుంచి కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతూ వస్తున్నాయి. ప్రముఖ సినీ నటులు, రాజకీయ నాయకులు కరోనా భారిన పడుతున్నారు. తాజాగా ఏపి మంత్రి కొడాలి నానికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఆయన కరోనా స్వల్ప లక్షణాలతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అయితే ఎవరూ కంగారుపడాల్సిన అవసరం లేదని ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

ఇది చదవండి : కాలువలోకి దూసుకెళ్లిన కారు.. వైసీపీ ఎమ్మెల్యే తమ్ముడి ఫ్యామిలీ గల్లంతు

image 0 compressed 56ఇటీవల మంత్రి కొడాలి నాని పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు స్వల్పంగా లక్షణాలు కనిపించడంతో వెంటనే పరీక్షలు చేయించుకున్నారు. పాజిటివ్‌గా తేలడంతో.. డాక్టర్ల సూచన మేరకు ఆస్పత్రిలో చేరారు. ఇటీవల తనను కలిసిన వారందరూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కొడాలి నాని కోరారు. అంతే కాదు కరోనా జాగ్రత్తలు పాటించాలని.. ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్క్, సోషల్ డిస్టెన్స్ పాటించాలని సూచించారు. ఇటీవల కొడాలి నానిని కలిసిన వారిలో కూడా టెన్షన్ మొదలైంది.