రాజ్యసభలో సోమవారం కొత్తగా 25 మంది ఎంపీలుగా ప్రమాణస్వీకారం చేశారు. వారిలో టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్‌సింగ్ కూడా ఒకరు. అలాగే తన సహచర ఆటగాడు గౌతమ్ గంభీర్ ఇప్పటికే లోక్ సభ ఎంపీగా కొనసాగుతున్నారు. దీంతో ఇద్దరు పార్లమెంట్‌లో కలుసుకున్నారు. అలాగే ఈ ఇద్దరూ కలిసి తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్ నాయుడుతో ఫొటో దిగారు.
ఆ ఫొటోను ఎంపీ రామ్మోహన్ నాయుడు తన అధికారిక సోషల్ మీడియాలో అకౌంట్‌లో పోస్టు చేస్తూ.. ‘భారత్‌ను గర్వించేలా చేసిన గొప్ప క్రీడాకారుల మధ్య కూర్చున్నా. ఒకరు ఇప్పటికే ప్రజా జీవితంలో ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. మరొకరు ఇవాళే కొత్తగా ప్రజా జీవితంలో అడుగుపెడుతున్నారు. ఆల్ ది బెస్ట్ పాజీ’ అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
గౌతమ్ గంభీర్ 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఈస్ట్ ఢిల్టీ నుంచి గెలుపొందిన సంగతి తెలిసిందే. మరోవైపు హర్భజన్ సింగ్ ఇటీవలే పంజాబ్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున రాజ్యసభకు నామినేట్ అయ్యారు. సోమవారం ప్రమాణస్వీకారం సందర్భంగా గంభీర్, రామ్మోహన్ నాయుడుతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. మరి ఈ ఫొటోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Sitting between sporting greats who’ve repeatedly made India proud. One has already begun an innings in public life. The other is making his debut today. All the best paaji! Parliament is a true melting pot of India, w/ persons from diverse backgrounds, regions & perspectives. pic.twitter.com/YVgstkr8Xu
— Ram Mohan Naidu #విశాఖఉక్కుఆంధ్రులహక్కు (@RamMNK) July 18, 2022