పేర్ని నానితో ముగిసిన రామ్ గోపాల్ వర్మ భేటీ!

RGV Comments on AP Government for Pavan Kalyan

ఏపీలో సినిమా టికెట్ల ధరల వివాదంపై చర్చించేందుకు గాను దర్శకుడు రామ్‌ గోపాల్‌ సోమవారం అమరావతి వచ్చి.. మంత్రి పేర్ని నానిని కలిశారు. తాజాగా మంత్రితో వర్మ భేటీ ముగిసింది. సమావేశం అనంతరం రామ్‌ గోపాల్‌ వర్మ మీడియాతో మాట్లాడారు. మంత్రి పేర్ని నానితో చర్చలు సంతృప్తిగా సాగాయి అని తెలపారు. తాను ఇండస్ట్రీ తరఫున మాట్లాడటానికి ఇక్కడకు రాలేదని.. తన సమస్యపై చర్చించేందుకు ఇక్కడకు వచ్చానని ఆర్జీవీ స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల.. దర్శకుడిగా తనకు నష్టం కలుగుతుంది.. కనుక దాని గురించి చర్చించేందుకు ఈ రోజు ఇక్కడకు వచ్చానని తెలిపారు. ప్రభుత్వం వెల్లడించిన కొన్ని విషయాల గురించి.. తనకు తెలియదని.. వాటి గురించి స్టడీ చేస్తానని ఆర్జీవీ వెల్లడించారు.

ఇది కూడా చదవండి : RGV కామెంట్స్ కి అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన కొడాలి నాని!

Perni Nani Counter to RGV Questions

సినిమా టికెట్ల రేట్లను నిర్ణయించే హక్కు ప్రభుత్వానికి లేదని.. తాను ఈ అంశం గురించే ప్రధానంగా భేటీలో చర్చించానని ఆర్జీవీ తెలిపారు. రేట్ల తగ్గింపుతో సినిమా క్వాలిటీ దెబ్బతింటుందని తెలిపాను అన్నారు. ప్రభుత్వ జోక్యంతో ఎలాంటి సమస్యలు తలెత్తుతున్నాయో వెల్లడించాను అన్నారు. ఇక చిన్న సినిమాలకు ఒక రేటు.. పెద్ద సినిమాలకు మరో రేటు గురించి తాను మాట్లాడలేదు అన్నారు. కొందరిని దృష్టిలో పెట్టుకుని.. వారిని ఇబ్బంది పెట్టడం కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందా అని విలేకరులు వర్మను ప్రశ్నించగా.. ఎవరో ఒకరిద్దరి కోసం ఇంత మందిని ప్రభుత్వం ఇబ్బంది పెట్టదని వర్మ స్పష్టం చేశారు. సామాన్య ప్రేక్షకుడిని దృష్టిలో పెట్టుకుని.. దీనిపై సరైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరానని ఆర్జీవీ తెలిపారు. ఆర్జీవీ-పేర్ని నాని భేటీతో సమస్యకు పరిష్కారం లభిస్తుందని చాలా మంది భావించారు. కానీ ఆశించిన ఫలితం మాత్రం రాలేదు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి : రామ్ గోపాల్ వర్మ పుస్తకమే నా జీవితాన్ని మార్చింది: ‘పుష్ప’ ఫేమ్ కేశవ