మారితే తాను RGV ఎలా అవుతాడు.. ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు

RGV Tweets on AP Government

ఏపీలో గత కొద్ది రోజులుగా నడుస్తోన్న సినిమా టికెట్ల ధరల వివాదంలో ఈ రోజు ఓ క్లారీటీ వచ్చే అవకాశం ఉంది. టికెట్ల ధర నిర్ణయంపై ప్రభుత్వం నియమంచిన కమిటీ ఇవాళ తొలిసారి ఫిజికల్ గా సమావేశం అవుతోంది. ఇప్పటికే వరకు వర్చువల్ గా సమావేశమైన కమిటీ నేడు నేరుగా సమావేశం కానుంది. ఇప్పటి వరకు ఇండస్ట్రీ నుంచి వచ్చిన అభిప్రాయాలపై చర్చించి.. తుది నివేదికను ప్రభుత్వానికి ఇవ్వనుంది. ఆ తరువాత ఏపీలో టికెట్ల రేట్ల పై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఓ వైపు సామాన్యులతో సహా ఇండస్ట్రీ పెద్దలు కూడా ప్రభుత్వం తీసుకుబోయే నిర్ణయం గురించి ఆత్రుతగా ఎదురు చూస్తుండగా.. సడెన్‌ గా సీన్‌ లోకి ఎంట్రీ ఇచ్చారు రామ్‌ గోపాల్‌ వర్మ. కట్టప్ప ఎవరుంటూ ఏపీ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు.

అదేంటి సోమవారమే కదా.. వర్మ, మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యారు. సమస్య గురించి చర్చించానని.. తన అనుమానాలను వ్యక్తం చేశాను.. ప్రభుత్వం చెప్పిన కొన్ని అంశాలను తాను స్టడీ చేస్తానని ప్రకటించిన వర్మ.. సడెన్‌ గా ఇలా రూట్‌ మార్చి.. కట్టప్ప ఎవరు అంటూ ప్రభుత్వంపై సెటర్లు వేయడం ఆశ్చర్యంగా ఉంది అంటున్నారు నెటిజనులు.


ఇది కూడా చదవండి : పేర్ని నానితో ముగిసిన రామ్ గోపాల్ వర్మ భేటీ!

ఈ క్రమంలో వర్మ ‘‘మహారాష్ట్రలో ఆర్‌ఆర్‌ఆర్‌ టిక్కెట్‌ ధర 2,200 రూపాయలుగా అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. అదే తెలుగు వారి సొంత రాష్ట్రమైన ఏపీలో మాత్రం సినిమా టికెట్‌ ధర కనీసం 200 రూపాయలు కూడా లేదు. ఇది తెలుగు వారి అస్తిత్వం గురించి ప్రశ్నను లేవనెత్తుతుంది. ఇంతకు కట్టప్పను ఎవరు చంపారు’’ అంటూ  తనదైన స్టైల్లో ప్రభుత్వంపై ఇండైరెక్ట్‌ గా పంచ్‌ వేశాడు. వర్మ ఉద్దేశం ప్రకారం.. ఎవరు తెలుగు సినిమా ఇండస్ట్రీని చంపేస్తున్నారంటూ ఇన్ డైరెక్ట్ గా ఏపీ ప్రభుత్వం తీరుని తప్పు పట్టారు. మరి సోమవారం మంత్రి పేర్ని నానితో టికెట్ ధరల విషయంపై భేటి అయి.. సంతోషం వ్యక్తం చేసిన ఆయన.. మళ్లీ ఎందుకు ఇలా సెటైర్లు మొదలు పెట్టారో అర్థం కావడం లేదంటున్నారు వైసీపీ అభిమానులు. వర్మ ట్వీట్‌ పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.